పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/129

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

"నేను ఓ పురుగునుగాని నరుణ్ణికాదు
అందరూ నన్ను నిందించేవాళ్ళే
అందరూ నన్ను ఎగతాళి చేసేవాళ్ళే
నన్ను చూచినవాళ్ళంతా పకపక నవ్వుతూన్నారు
పెదవులు విరచి తల ఆడించి అపహసిస్తున్నారు
ఇతడు దేవుణ్ణి నమ్మాడుకదా
మరి ఆ దేవుడే వచ్చి ఇతన్ని రక్షిస్తాడేమో చూద్దాం,
ఇతడే గనుక దేవుని కిష్ణుడైతే
ఆ ప్రభువే వచ్చి ఇతన్ని ఈ శ్రమలనుండి
విడిపించాలిగదా - అంటున్నారు
శత్రువులు పోట్లగొడ్లలాగ నన్ను చుట్టుముట్టారు
క్రూరమైన బాషానుమండలం వృషభాల్లాగ నన్నావరించారు
నా విరోధులు సింహాల్లాగ భయంకరంగా గర్ణిస్తూ
కోరలు తెరచి నా మీదికి దూకబోతున్నారు
నేను నేలమీద తొణికిపడిన నీళ్ళలాగ ఇంకిపోయాను
నా యెముకలన్నీ కీళ్ళు దప్పాయి
నా హృదయం లోలోపలే మైనంలా కరిగిపోయింది
నా గొంతు ఆవంలోని పెంకులా యెండిపోయింది
నా నాలుక అంగిటికి అంటుకొని పోయింది, నేను నేలగరిచాను
దుష్టులు చాలమంది నన్ను చుట్టుముట్టారు
రేచుకుక్కల్లాగ నా వెంట బడ్డారు
వాళ్ళు నా కాలు సేతుల్లో రంధ్రాలు తొలిచారు
నా యెముకలన్నీ బయటపడ్డాయి
నా శత్రువులు నావైపజూచి వికటంగా నవ్వతూన్నారు
వాళ్ళు చీట్లవేసి నా దుస్తులను పంచుకొన్నారు" - కీర్త 22, 7-18.

ఇది క్రీస్తుకి వెయ్యేండ్లకు పూర్వమే వ్రాయబడిన కీర్తన. ఐనా ప్రభువు శ్రమలను అద్భుతంగా చిత్రిస్తుంది. అతని బాధలను కన్నులకు కట్టినట్లుగా వర్ణిస్తుంది. కనుకనే ప్రభువు సిలువమీద వ్రేలాడుతూ ఈ కీర్తనను జపించాడు.

ఈ కీర్తనలో క్రీస్తు దేవుణ్ణి "నాదేవా" అని సంబోధించి విలపించాడు. ఈ సందర్భంలో క్రీస్తు మానుష స్వభావమూదైవస్వభావమూ వేరువేరుగా విడిపోయాయనీ,