పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/126

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మూడవ వాక్యం

"ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి" - యోహా 19, 26–27.

ప్రభువు సిలువమీద వ్రేలాడుతూంటే క్రిందశిష్యుడు యోహానూ, మరియమాతా, ఇతర పుణ్యస్త్రీలూ నిల్చివున్నారు. క్రీస్తు తన్నుతాను తండ్రికి అర్పించుకొంటూంటే మరియకూడ తన కుమారుడైన క్రీస్తుని తండ్రికి అర్పిస్తూంది. ఆమె తల్లి హక్కులన్నిటినీ వదలుకొని తన కుమారుణ్ణి మన తరఫున పితకు సమర్పించింది. ఆమె పూర్వం మనుష్యావతార సందర్భంలో నీ మాట చొప్పన నా కగునుగాక అని దైవచిత్తానికి లోబడింది. ఇప్పడు కల్వరి కొండమీద మళ్ళా రెండవసారి దైవచిత్తానికి లొంగి క్రీస్తుని తండ్రికి నివేదనం చేసింది. క్రీస్తు నెత్తురు బొట్లతో తన కన్నీటి బొట్లనుగూడ మేళవించింది, అతనిలా శారీరక వేదనలనుభవించక పోయినా తాను ఘటోరమైన మానసిక వేదనలు అనుభవించింది, వీటన్నిటివలనా ఆమె క్రీస్తుతో పాటు తానూ సహరక్షకి ఐంది, ఈ సందర్భంలోనే ప్రభువు "అమ్మా! ఇదిగో నీ కుమారుడు" అని యోహానుని మరియకు కుమారునిగా దయచేసాడు. "ఇదిగో నీ తల్లి" అని ఆ శిష్యునికి తన తల్లిని తల్లిగా అనుగ్రహించాడు.

ఇక్కడ యోహానుని జెబెదయి కుమారుడనే ఓ ప్రత్యేక వ్యక్తిగాగాక, ఓ శిష్యునిగా మాత్రమే గ్రహించాలి. ఆ శిష్యుడు మనకందరికీ ప్రతినిధిగా వుంటాడు. మనలనందరినీ సూచిస్తూంటాడు. అతనిద్వారా మరియు మనకందరికీ తల్లి ఔతుంది, మనమందరమూ ఆమెకు బిడ్డలమౌతాం. యోహాను తల్లియైన సలోమిగూడ అప్పడు సిలువదగ్గిరే వుంది - యోహా 19,25, ఆలా అతనిసాంత తల్లి దగ్గిరే వుంటే ప్రభువు మళ్ళా తన తల్లిని అతనికి తల్లిగా ప్రసాదించడం దేనికి? ఇక్కడ యోహానుని ఓ ప్రత్యేక వ్యక్తిగా తీసికోగూడదనీ, ఆతడు మనకందరికీ ప్రతినిధిగా వుంటాడనీ ముందే చెప్పాం. మనకు సాంకేతికంగా వున్న యోహాను ద్వారా మరియు మనకందరికీ తల్లి ఔతుందని గూడ చెప్పాం. ఇదే ఆమె ఆధ్యాత్మిక మాతృత్వం.

మరియు తన తొలిచూలి కుమారుణ్ణి కంది అని సువార్తలో చదువుతున్నాం - లూకా 2, 7. ఆమెకు మలిచూలి బిడ్డలు కూడ ఉన్నారు. కాని వీళ్ళ శారీరకంగా పుట్టినవాళ్లు కాదు. ఆమెకు శారీరకంగా పుట్టిన బిడ్డడు ఒక్కడే ఒక్కడు, క్రీస్తు, మనమందరమూ ఆమెకు ఆధ్యాత్మికంగా పుట్టిన మలిచూలి బిడ్డలం.

మరియు తొలిచూలి బిడ్డను కన్నపుడు ఏ బాధ అనుభవించలేదు. ఆమె పసుల కొట్టంలో సంతోషంతో క్రీస్తునికంది. కాని కల్వరికొండమీద మలిచూలి బిడ్డలమైన మనలను