పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/122

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వాక్యాలను ఏడు సందేశాల్లాగ విన్పించాడు. రెండువేల యేండ్లనుండి క్రైస్తవ ప్రపంచం ఈ పలుకులను భక్తిభావంతో మననం చేసికొంటూ వసూంది. వాటిల్లోని భావాలను తరచితరచి చూస్తూవస్తూంది. ప్రభువులాంటి బోధకుడు లేడు. నాడు కల్వరిచుట్టు మూగిన ప్రజల్లాంటి శ్రోతల్లేరు. సప్తవాక్యాల్లాంటి ప్రసంగమూ లేదు. ఈ ప్రసంగాన్ని ఫుల్టేన్ జె. షీన్ గారి క్రీస్తు చరిత్రనుండి గ్రహించాం.

మొదటి వాక్యం

“తండ్రీ! వీళ్ళేమి చేస్తున్నారో వీళ్ళకే తెలియదు. కనుక వీళ్ళను క్షమించు"

- లూకా 23, 34.

సిలువ మరణాన్ని అనుభవించేవాళ్ళు ఆ బాధను భరించలేక పెడబొబ్బలుపెట్టి వెర్రికేకలు వేసేవాళ్ళ. సెనెకా వ్రాతల ప్రకారం సిలువమీద వ్రేలాడేవాళ్ళు తాము పట్టిన దినాన్నీ తమ్ము కొరతవేసేవాళ్ళనూ, కడకు తమ్ము కన్న తల్లలనూగూడ శపించేవాళ్ళట. తమచుటూ వున్నవాళ్ళ మొగాలమీద ఉమ్మివేసేవాళ్ళట. సిసిరో కూడ సిలువవేదనలు అనుభవించేవాళ్ళ దుర్భాషలూ దేవదూషణలూ పలికేవాళ్ళనీ, కనుక సైనికులు ఒకోసారి వాళ్ళ నాలుకలను కోసివేసేవాళ్ళనీ వ్రాసాడు. క్రీస్తుని కొరత వేసేవాళ్ళకూడ అతని నోటినుండి దూషణలు వెలువడతాయనుకొన్నారు. క్రీస్తు పూర్వం "మీ శత్రువులను ప్రేమించండి" "మిమ్మ ద్వేషించేవాళ్ళకు మంచిని చేయండి” అని బోధించాడు. కాని ఇప్పడు అతని కాలు సేతుల్లో చీలలు దిగగొట్టారు. అతన్ని సిలువమీద వ్రేలాడదీసారు. కనుక ఈ బాధల్లో అతడు తన పూర్వబోధలన్నీ గాలికి వదిలివేస్తాడనుకొన్నారు పరిసయులూ సదూకయులూ, అందరూ క్రీస్తు నోటినుండి పరుషవాక్యాలు వెలువడతాయనుకొన్నారు. వాళ్ళ ఊహలు విఫలమయ్యాయి. అతని నోటినుండి కటువైన దూషణవాక్యాలుకాక, మృదువైన క్షమావాక్యాలు వెలువడ్డాయి. మంచి గంధపు చెట్టు తన్నునరికే గొడ్డళ్ళను సుగంధంపూసి సత్కరిస్తుంది. అలాగే క్రీస్తకూడ తన్ను హింసించేవాళ్ళను పల్లెత్తిమాట అనలేదు. పైపెచ్చు వాళ్ళను క్షమించమని తండ్రికి మనవిచేసాడు. వాళ్ళేమి చేస్తున్నారో వాళ్ళకే తెలియదు. కనుక వాళ్ళను శిక్షించవద్దనీ మన్నించి వదిలివేయమనీ ప్రార్థించాడు.

అతన్ని హింసించే శత్రువులెవరు? కయిఫా యింటి ముంగిటిలో తన్ను గుద్దులు గుద్దిన సైనికులు, కైజరు మన్నన పొందడం కొరకు తనకు అన్యాయంగా శిక్ష విధించిన పిలాతు, తనను పిచ్చివానినిగా గడించిన హెరోదు తన్ను సిలువవేసే రోమను బంట్రిబౌతులు, కపటంతో తన్ను నాశం చేయగోరిన అన్నా కయిఫాలాంటి వక్రబదులు. క్రీస్తు ఈలాంటివాళ్లనందరినీ క్షమించమని తండ్రిని వేడాడు.