పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/116

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పదవ స్థలం

క్రీస్తు వస్తాలను విప్పడం

యూదులు క్రీస్తు స్వాతంత్ర్యాన్ని అపహరించారు, ఇప్పడు అతని మానగౌరవాలనుగూడ దోచుకోడానికి సిద్ధమయ్యారు. అ మడ్డెతనపు ప్రజలు అతన్ని వస్తహీనుని గావించి అవమానపరచారు. దారివెంట బోయేవాళ్ళుకూడ క్రీస్తువైపు వ్రేలెత్తిచూపి వహ్వాయని గేలిచేసారు. పూర్వం దీర్ఘదర్శి అని మెస్సీయా అని పెద్దగా పొగడినవాళ్ళంతా ఇప్పడు క్రీస్తుని దిక్కులేని పేదనరునిక్రింద లెక్కగట్టి చిన్నచూపు చూచారు.

క్రీస్తు హృదయం అగాధం నిబ్బరం, సుకుమారం ఐంది. కావున ఈ యవమానాలు అతనికెంతో చింత కలిగించాయి. ఐనా అతడు పిత చిత్తానికి తలయెగ్గినిండు మనస్సుతో ఆ యవమానాలను భరించాడు.

ప్రార్ధనం

అవమానితుడవైన ప్రభూ! నా గౌరవానికి భంగం కలిగినపుడు నీ వనుభవించిన అవమానాన్నిస్మరింతునుగాక. ప్రజలు నా వద్దేశాన్ని అపార్థంజేసికొని, నా కార్యకలాపాలను వక్రబుద్ధితో విమర్శించి, నా పేరు ప్రతిష్టలను మంట గలపినపుడు నీ వనుభవించిన ఈ యవమానాన్ని గుర్తుకి తెచ్చుకొందునుగాక, నాకొరకై నీవింతటి అగౌరవాన్ని సహించావు. నీ కష్టానుభవాల ఫలితంగా నాకు సంభవించే అగౌరవాల్లో నన్ను ఆదుకో.

ప్రభూ! అన్యులు నన్ను తూలనాడినపుడు శాంతభావాన్ని విడనాడకుందునుగాక, నన్ను నిందించేవారిపై ప్రతినిందలు మోపకుందునుగాక. నాకు ద్రోహం చేసే వాళ్లపై హృదయం కాలుష్యం పెంచుకోకుందునుగాక, విశాల హృదయంతో ఉదాత్తభావాలతో నీయందు మాత్రం విశ్వాసముంచి, నిందాపవాదాలనే పెనుగాలికి తట్టుకొని నిల్తునుగాక.

పదకొండవ స్థలం

క్రీస్తుని సిలువకు అంటగొట్టడం

కండ్లతోచూచి సహించలేక ప్రజలు ప్రక్కకు తొలగిపోయేంతటి ఘాతుక కృత్యమది. సజీవుడైయున్న క్రీస్తుని సిలువపై పరుండబెట్టి కాలు సేతుల్లో ఇనుపచీలలు దిగగొట్టారు. సిలువతోపాటు అతన్ని పైకెత్తారు. ఎంత హృదయవిదారకమైన దృశ్యమది! ఐనా మనం.