పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భూలోకంలోని తండ్రులు బిడ్డలకు మంచి యీవులు ఇస్తూంటారు. ఈ తండ్రుల కంటె పరలోకంలోని తండ్రి శ్రేష్ఠుడుకాడా? అతడు తన బిడ్డలు అడుగుకొనే మనవులను అనుగ్రహించడా? - మత్త 7,11.

ప్రభువు అద్భుతాలు చేసేప్పడు ఒకేవొక షరతు పెట్టేవాడు - ప్రజలకు తనయందు విశ్వాసం వుండాలి అని. పేతురు నీళ్ళమీద నడవడానికి అనుమానపడ్డం జూచి ప్రభువు అతన్ని మందలించాడు - మత్త 14,32 శిష్యులు అవిశ్వాసులై మూగదయ్యాన్ని పారద్రోలలేక పోవడంజూచి ప్రభువు వాళ్లను చీవాట్ల పెట్టాడు - మార్కు 9,19. క్రీస్తు స్వగ్రామమైన నజరేతునకు వెళ్లినపుడు అక్కడి ప్రజలు అతనియందు విశ్వాసముంచలేదు. కనుక ఆ గ్రామంలో అద్భుతాలేమి చేయలేక పోయాడు - మత్త 13,58. కనుక విశ్వాసంలేనివాళ్ళు ప్రభువునకు ప్రియపడరు.

5. సోదర ప్రేమతో - మార్కు 11, 25-26

ప్రార్థనాపరుడు భగవంతునికి అనుకూలంగా జీవించాలిగాని ప్రతికూలంగా జీవించగూడదు. అదేవిధంగా అతని హృదయంగూడ తోడి జనులకు సుముఖంగా వుండాలి గాని విముఖంగా వుండగూడదు. కనుక ప్రార్థనకు పూనుకోకముందు తోడిప్రజలు మనకు చేసిన అపకారాన్ని క్షమిస్తూ వుండాలి,.ఆలాగే మనం తోడిప్రజలకు చేసిన అపకారాన్ని తలంచుకొని సంతాపపడుతూ వుండాలి. అప్పడుగాని ప్రభువు మన ప్రార్థనను వినిపించుకోడు. ఓమారు ప్రభువు ఈలా సెలవిచ్చాడు. బలిపీఠం చెంత కానుకలు సమర్పిస్తూ వుండగా తోడివానితో పగగావున్న సంగతి జ్ఞాపకానికి వస్తుంది. అప్పడు ఆ కానుకను అక్కడే వదలివేసి వెంటనే వెళ్లి ముందుగా తోడివానితో సమాధానపడి రావాలి. అనగా దేవునికి కానుకలు సమర్పించడంకంటె తోడి వారిపట్ల ప్రేమభావంతో ప్రవర్తించడం ముఖ్యం అని భావం - మత్త 5, 23-24. కనుక సోదరప్రేమలేని ప్రార్థన ప్రభువునకు ప్రియపడదు. ఇది మూడవ షరతు

6. దేవుడు అహంకారులను ఎదిరిస్తాడు - యాకో 46

దేవుడు అహంకారులను లక్ష్యంచేయడు. దీనులను ఆదరిసూ వుంటాడు. వినయాత్మలకు తన కృపను అనుగ్రహిస్తూ వుంటాడు. ఈ సత్యాన్ని బోధించడంకోసమే ప్రభువు సుంకరి, పరిసయుల సామెత చెప్పాడు, సుంకరి దేవాలయానికివెళ్లి వినయంతో తన పాపాన్ని వొప్పకున్నాడు. క్షమాపణం పొందాడు. కాని పరిసయుడు పీఠంముందు నిలచి గర్వంతో తన్నుతాను పొగడుకున్నాడు. తనప్రక్కనే నిలబడి వున్నసుంకరిని చిన్నచూప చూచాడు. అతడు నేను నీతిమంతుణ్ణి అనుకున్నాడుగాని ప్రభువు మాత్రం అతణ్ణి