పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/109

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నాల్గవ స్థలం

క్రీస్తు తన తల్లిని కలసికొనడం

ప్రక్కత్రోవవెంటవచ్చి మరియు తన కుమారుని కలసి కొనివుండవచ్చు. వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూచుకున్నారేగాని, ఒకరితో ఒకరు మాట్లాడలేదు. అట్టి పరిస్థితుల్లో ఏమి మాట్లాడగలరు? చుటూ మట్టివున్న శత్రుజనంమధ్య వాళ్ళిద్దరూ ఒకరి కండ్లలోనికి ఒకరు దృష్టిని ప్రసరిస్తూ ఒకరి హృదయాన్నొకరు అర్థంజేసికొంటూ, ఒక్క క్షణకాలం అట్టే నిలుచుండిపోయారు. ఆ సమయంలో వాళ్ళ హృదయాల్లో నుండి ఎంతటి ప్రేమ భావాలు, ఎంతటి పరితాప భావాలు పెల్లుబికాయో ఎవరు చెప్పగలరు?

కాని ఒకరినొకరు చూచుకొన్నందున వాళ్ళ హృదయాలు మెత్తబడి సత్తువను గోల్పోలేదు. ఎన్ని ప్రేమభావాలు చెలరేగుతున్నా ఏ ఉద్దేశం కొరకు దివ్యపిత క్రీస్తు పాటులను నిర్ణయించాడో ఆ వద్దేశం, ఆ తల్లీకొడుకుల మనస్సులో నుండి మాసిపోలేదు. బిడ్డలనుగూర్చి దుర్భర వేదనలు అనుభవించే తల్లల హృదయాలు సాధారణంగా మొదువారిపోతాయి. కాని స్త్రీలలో ఆశీర్వదింపబడిన ఆ ధన్యమాత హృదయం మాత్రం తన సున్నితత్వాన్ని ఏ మాత్రం కోల్పోక ఫరోరవ్యధను అనుభవించింది. అప్పడు మాటలులేని ఆ కుమారుని చూపలే "తల్లీ! పిత చిత్తం ఈలా నెరవేరాలి" అని మాట్లాడాయి. కదలికలేని ఆ పునీతమాత ముఖభంగిమలే "కుమారా! పితకూ నీకూ సమ్మతమైన రీతినే సమస్తమూ నెరవేరునుగాక" అని సూచించాయి.

ప్రార్ధనం

ప్రేమపూరితుడవైన ప్రభూ! నీకూ నీ తల్లికీ మధ్య ఎడబాటును కలిగించిందీ, మీ యిరువురి బాధను పెంచిందీ నా పాపాలే. తండ్రీ! నీ గారాబు తల్లినుండి వైదొలగడంలో నీవు చూపించిన త్యాగం నాపట్ల వ్యర్థంగాకుండు గాక. నీవేదైనా పనిని నెరవేర్చడం కొరకు నన్ను పిల్చినపుడు, నన్ను కన్నవారు పేమించినవారు నాకంటిపెట్టుకొని ఉండగోరుతారు. ఆలాంటి సమయాల్లో, నీవు చూపించిన త్యాగం నాలో ఔదార్యగుణాన్ని పెంపొందించునుగాక. నిన్ను ప్రకటించవలసిన బాధ్యత ఒకవైపునా, నీ పట్ల సుముఖులుగాని నా బంధువుల నిర్బంధం మరొక వైపునా నన్ను చిక్కుల్లో బెట్టినపుడు మీ తల్లీ కుమారుల పుణ్యచరితం నాకు ధైర్యాన్ని దయచేయునుగాక. మనుష్యుల ప్రేమవలన - ఆ ప్రేమ యెంత బలీయమైనదైనా, ఎంత నిర్మలమైనదైనా, ఎంత పవిత్రమైనదైనా - నేను నీ ప్రేమకు దూరంగాకుందునుగాక. ఆ మానుషప్రేమకంటె నీ దివ్యప్రేమ నాయందు