పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/107

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శిక్షను తప్పక అనుభవించాలా లేక తప్పించుకొనే మార్గం వుందా అనే ఆలోచనకిక తావులేదు. జరుగబోయే ఫరోరవిపత్తు బొమ్మగీసినట్లుగా అతని కన్నులయెదుట కన్పిస్తూంది. ఇక తిరుగులేదు. ఐనా క్రీస్తుని ముందుకి నడిపించింది ఇక తప్పించుకొనే మార్గం లేదే అన్న నిరాశకాదు. అతని స్వేచ్చాప్రవృత్తే, అతడు పూర్ణస్వాతంత్ర్యంతో, పూర్ణచిత్తంతో, మన కొరకు బాధలనుభవించాలని నిర్ణయించుకొన్నాడు.

పిత చిత్తం, మానవుల రక్షణకార్యం - ఇవి రెండూ క్రీస్తుకి ఆ సిలువలో కన్నులకు కట్టినట్లుగా కన్పిస్తూనే వున్నాయి. అతడు పూర్ణహృదయంతో ఈ రెండంశాలకీ తన అంగీకారాన్ని తెల్పుతూన్నాడు. ఆ ఫరోరసమయంలో గూడ అతని ఆత్మ గాలిలేనితావులో నిశ్చలంగా వెలిగే దీపంలా, ప్రశాంతంగా వుంది. అలలులేని మడుగులోలాగే అతని హృదయంలోగూడ ఆందోళనం ఏమిలేదు. అదిగో ప్రభువు ముందుకి అడుగిడి మెల్లగావంగి సిలువను భుజాల మీదికి ఎత్తుకొన్నాడు.

ప్రార్ధనం

శ్రమమూర్తివైన ప్రభూ! ఆపదలు రానంతవరకు దేవుడు పంపే బాధలన్నీ భరించడానికి సిద్ధంగానే వున్నాను అని చెప్పడం ఒక యెత్తు, కాని ఆ బాధలు వచ్చినపుడు వాటిని ఓర్పుతో అంగీకరించడం ఇంకో యెత్తు, కష్టాలు నిజంగా పైనబడినపుడు మానవ హృదయం భయపడి, బెండువోయి, మొదటి మంచి మాటపట్టలన్నిటినీ మెల్లమెల్లగా జారవిడుస్తుంది.

  కావున ప్రభూ! పరీక్షా సమయం వచ్చినపుడు నీవు నా దాపులోనే వుండి నాకు అండాదండా ఐయుండు. నా హృదయాన్ని హెచ్చరించు. బహుశః నీవు పంపే సిలువలు నా దాపులోకే వచ్చివుండవచ్చు. వాటి చీకటి నీడలు నాపై యిపుడే వాలుతూండవచ్చు. ఐనా నీ కృపా సహాయాలతో వాటిని భరించడానికి సిద్ధంగానే వున్నాను. నీ చిత్తపద్ధతినీ, నీ పిత కోరికనూ మీరకూడదనే ఔదార్యభావాన్ని మాత్రం నాకు అనుగ్రహించు. నీవు దయచేసే దార్థ్యం వలన నా హృదయం చేవదేలునుగాక. నేను మంచి మనస్సుతో నీవు పంపే బాధలను స్వీకరిస్తే, అవి యెంత ఘటోరమైనవైనా సరే అంతగా బాధ అనిపింపవు.

మూడవ స్థలం

యేసు మొదటిసారి స్టీవక్రింద కూలబడ్డం

రాత్రంత క్రీస్తుకి నిద్రలేదు. ముందటిదినపు సాయంత్రంనుండి అతడేమి భుజించలేదుకూడ గంటల కొలది యూదులు అతన్ని ఒక న్యాయస్థానంనుండి ఇంకొ