పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/103

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

6. బాధాతత్వం

మున్నుడి

   ఈ పొత్తంలో రెండు బైబులు భాష్యం సంచికలను కలిపి ప్రచురించాం. మొదటిది, బాధాతత్వం, దీనిలో సిలువ మార్గంమీద ధ్యానాలు వస్తాయి. దీన్ని పూర్వమే బైబులు భాష్యం 90వ సంచికగా ప్రచురించాం, రెండవది, సప్తవాక్యాలు. ఇవి క్రీస్తు సిలువమీదనుండి పలికిన వాక్యాలు. దీన్ని పూర్వమే బైబులు భాష్యం 90వ సంచికగా అచ్చువేసాం, ఈ రెండు పొత్తాలు క్రీస్తు శ్రమలను వర్ణించేవే. ఈ గ్రంథం విశేషంగా తపస్సుకాలంలో వాడుకోదగ్గది. సంవత్సరం పొడుగునాకూడ ప్రార్థనకు వినియోగించు కోవచ్చు. ఇది నాల్గవ ముద్రణం.

విషయ సూచిక

1. బాధాతత్వం
2. సప్త వాక్యాలు

1. బాధాతత్వం

ఉపోద్ఘాతం

 బాధాతత్వం అనే యీ ವಿನ್ನಿ పుస్తకంలో సిలువ మార్గాన్ని గూర్చిన ధ్యానాలు 14 పొందుపరచాం. ఇందలి భావాలను రొమానో గ్వార్జీనిగారు రచించిన The Way of the Cross అనే పుస్తకంనుండి గ్రహించాం.
యెరూషలేములోని తొలి క్రైస్తవులు క్రీస్తు చనిపోయిన కొలది నాళ్ళనుండే, అతడు సిలువను మోసికొని పోయిన త్రోవవెంట భక్తితో నడుస్తూ ఆ ప్రభువు అనుభవించిన ఆయూ శ్రమలను మననం చేసికొనేవారు. రానురాను ఇతర ప్రాంతాలనుండి యెరూషలేమునకు యాత్ర వచ్చిన భక్తులకుకూడ ఈ యాచారం అలవాటైపోయింది. క్రైస్తవ భక్తులు క్రీస్తు సిలువమార్గం వెంట బోతూ యేసు ఆయా ఘటోరబాధలు అనుభవించిన ఆయా స్థలాల్లో కొంతకాలం ఆగి భక్తి ప్రేమ కృతజ్ఞతలతో ఆ ప్రభువు అనుభవించిన