పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

2. అడగండి, మీకీయబడుతుంది - లూకా 11, 9–10.

ఈ వాక్యాల్లో అడగడం, వెదకడం, తట్టడం అనే మూడు ఉపమానాలు వాడబడ్డాయి. మన అక్కరల్లో తండ్రియైన దేవుణ్ణి వెదకాలి. అతనియింట ప్రవేశించి తలుపుతట్టాలి, మన అవసరాలేమిటివో ఆ తండ్రికి తెలియజేసికొని, అతని సహాయాన్ని అడుగుకోవాలి. ఈలా చేసినటైతే అతడు మనలను బిడ్డల్లాగ ఆదరిస్తాడు. ఈ వాక్యాల్లోని క్రియలన్నీగూడ "ఈయబడును” “తీయబడును" అనేరీతిగా కర్మణిప్రయోగంలో వున్నాయి. ఈ క్రియలన్నిటికీ కర్త ప్రభువే. అనగా మనకు తలుపుతీసేవాడు, మన మనవులను ఆలించి మనం అడుగుకునే వాటిని అనుగ్రహించేవాడు, ఆ తండ్రియే. పైగా ఇక్కడ, ఒకే భావాన్ని చెప్పడంకోసం అడగడం, వెదకడం, తట్టడం అనే మూడు ఉపమానాలు వాడారు. అనగా ప్రార్ధనం మనం అత్యవసరంగా చేయవలసిన పని అని భావం, భక్తుడు రోజురోజు, రేపుమాపు, ఎడతెగకుండ ప్రార్ధిస్తుండాలి. 3. నా నామమున మీరేమి యడిగినా - యోహా 14, 13-14

మన మనవి ప్రార్థన ప్రభువునకు ప్రియపడాలి అంటే కొన్ని నియమాలను లేక షరతులను పాటించాలి. మొదటి నియమం, మనం క్రీస్తుపేరుమీదగా ప్రార్థన చేయాలి. మన ప్రార్థనలన్నీ క్రీస్తనామంమీదుగా పరలోకపితకు అర్పించాలి. బైబుల్లో "నామం" వ్యక్తిని సూచిస్తుంది. క్రీస్తునామం క్రీస్తుని సూచిస్తుంది. కనుక క్రీస్తుపేరుమీదుగా ప్రార్ధన చేయడమనగా క్రీస్తుఅనే వ్యక్తి ఉద్దేశం ప్రకారం ప్రార్ధనం చేయడం. మనం పరిశుద్దులం గావడం, రక్షణాన్నిపొందడం - ఇది క్రీస్తు ఉద్దేశం. ఈ రక్షణాన్నే పరలోకరాజ్యంగా భావిస్తుంది నూత్నవేదం. కనుకనే "మీరు మొదట పరలోకరాజ్యాన్ని వెదకండి" అన్నాడు ప్రభువు - మత్త 6.33. మరో తావులో దైవచిత్తం ప్రకారం జీవించేవాడు పరలోకరాజ్యంలో ప్రవేశిస్తాడు అని చెప్పబడింది - మత్త 7, 21. కనుక క్రీస్తుపేరుమీదగా ప్రార్ధించడమనగా క్రీస్తకోరిక ప్రకారం ప్రార్థించడం, ఇక క్రీస్తుకోరుకొనేది మనం రక్షణం పొందాలిఅని, దైవచిత్తం నెరవేర్చి దైవరాజ్యంలో ప్రవేశించాలి అని. కనుక మన ప్రార్ధనం క్రీస్తుకోరికను అనుసరించివుండాలి. అనగా మన రక్షణానికి సంబంధించి వండాలి. ఇక్కడ రక్షణం దేహాత్మలకు రెండింటికీ వర్తిస్తుంది. కావున మనం ఈ భూమిమీది భౌతికావసరాలకోసమూ ప్రార్థించాలి, మోక్షభాగ్యం కోసమూ ప్రార్థించాలి.

4 మీరు అడిగే వాటినన్నిటినీ పొందామని నమ్మండి - మార్కు 11, 24

ప్రభువు మనం అడిగేవాటిని అనుగ్రహిస్తాడనే విశ్వాసం కూడ వుండాలి. ఇది రెండోషరతు. ఈ నమ్మికకు ఆధారమేమిటంటే - దేవుడు నమ్మదగినవాడు, తండ్రీ. 2