పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/99

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పూజబిలినర్పిస్తేనే చాలదు. మన జీవితమంతా కూడ బలిగా మారిపోవాలి. మనం బ్రతికివున్న బలిగా తయారుకావాలి. నరులమైన మనకు యుక్తమైన బలి యిదే, ఈ జీవితబలి పవిత్రమైందీ, దేవునికి ప్రీతిపాత్రమైందీని, ఫలితార్థమేమిటంటే క్రైస్తవుడు పవిత్ర జీవితం జీవిస్తూ ఆ జీవితాన్నే బలిగా దేవునికి అర్పిస్తాడు. సిలువబలితో కలసి ఈ జీవితబలి దేవునికి ప్రియపడుతుంది.

      3. దేవుని అద్భుతకార్యాలను లోకానికి ప్రకటిస్తాం - 1 పేత్రు 2,9. దేవుడు యూదులను ఐగుపు బానిసంనుండి విడిపించడం అద్భుతకార్యం, అంతకంటె అద్భుతకార్యం, అతడు క్రీస్తు మరణోత్థానాలద్వారా మనలను పాపంనుండి విడిపించడం. క్రీస్తుద్వారా లభించిన యీ రక్షణాన్ని మనం లోకానికి యెరుకపరచాలి. మన బోధలద్వారా, మన ఆదర్శప్రాయమైన జీవితంద్వారా గూడ మనం క్రీస్తుని లోకానికి ప్రకటిస్తాం. మనం క్రీస్తునందు ప్రవక్తలమౌతాం అంటే భావం ఇదే. 
     కనుక పూజబలి నర్పించడం ద్వారా, పవిత్రమైన జీవితాన్ని గడపడం ద్వారా, వేదబోధకులంగా మెలగడం ద్వారా మనం నూతవేదంలో యాజకులంగా వ్యవహరిస్తాం.
     ఈ యాజక జీవితమే మనలను పవిత్రులను చేస్తుంది. బైబులు భగవంతుడు మహా పవిత్రుడు. అతడు "నేను పవిత్రుజ్జయిన దేవుణ్ణి. నన్నుకొలిచే ప్రజలైన మీరుకూడ పవిత్రులుగా మెలగండి" అని మాటిమాటికి హెచ్చరిస్తుంటాడు- లేవీ 19,2. కనుక పూర్వవేద ప్రజలుకాని నూతవేద ప్రజలుకాని ప్రధానంగా పవిత్రులైన ప్రజలు. మనంపవిత్రంగా వుండాలనే దేవుడు కోరుకొనేది — 1తెస్ప 4,8. మనలను పవిత్రపరచడానికి ఆత్మకూడ మనకు తన ఫలాలను దయచేస్తుంది - గల 5.22.
      ఇంకో సంగతికూడ. మనకు రెండు యాజకత్వాలున్నాయి. మొదటిది జ్ఞానస్నానంద్వారా సిద్ధించేది. ఈ యాజకత్వం పురుషులు స్త్రిలు పిల్లలు మొదలైన పాళ్ళందరికీ సిద్ధిస్తుంది. దీన్ని జ్ఞానస్నాన యాజకత్వం అందాం. పైన మనం పేర్కొన్న యాజకత్వం
ఇదే ఇదికాక రెండవ యాజకత్వంకూడ వుంది. ఇది అభిషేకంపొందిన గురువులకు మాత్రమే సిద్ధిస్తుంది. ఈ యాజకత్వంతో గురువులు క్రైస్తవ సమాజానికి పరిచర్యలు చేస్తారు. వాక్యబోధ, సంస్కారాలు జరిపించడం మొదలైనవి ఈ పరిచర్యలు. కనుక ఈ రెండవ యాజకత్వాన్ని పరిచారక యాజకత్వం అందాం. ఇది గృహసులకుకాదు, గురువులకు మాత్రమే సిద్ధిస్తుంది. ఇక క్రైస్తవ ప్రజలు పవిత్రులు కావలసింది ప్రధానంగా జ్ఞానస్నాన యాజకత్వం ద్వారానే .