పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/98

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గొర్రెపిల్ల వధువమి - ప్రక 197, ఈ బిరుదాలన్నీ మొదట యిస్రాయేలీయులకు చెందినవి, తర్వాత క్రైస్తవులకు చెందుతాయి.

2. నూత్నవేద ప్రజల యాజకత్వం

'

   క్రీస్తు యాజకుడు, రాజు, ప్రవక్త, అతనిలోనికి జ్ఞానస్నానం పొందినపుడే మనకుగూడ ఈ మూడు లక్షణాలు సంక్రమిస్తాయి. అతనిద్వారా మనంకూడ యాజకులమూ, రాజులమూ, ప్రవక్తలమూ ఔతాం. వాటిలో యాజకత్వం చాల ముఖ్యమైంది. కనుక మొదట ఈ లక్షణాన్ని గూర్చి విచారిద్దాం.
    పూర్వవేద ప్రజలు ఎన్నికద్వారా దేవుణ్ణికొల్చేయాజకరూపమైన రాజ్యం అయ్యారని చెప్పాం - నిర్గ 19,6. నూత్నవేద ప్రజలమైన మనంకూడ జ్ఞానస్నానం ద్వారా రాచరికపు గురుకులాని మౌతాం -1 పేత్రు 2,9. అనగా ఆ యూదప్రజలాగే మనంకూడ దేవుణ్ణి పూజించేవాళ్లమౌతాం. దేవునికి అర్చకులమౌతాం. అతన్ని అర్చించడం ద్వారా పవిత్రులమా తాం. మన అర్చనం ప్రధానంగా బలిని సమర్పించడంలో వుంది. పూర్వవేదప్రజలు తమ అర్చనంలో జంతుబలిని సమర్పించేవాళ్ళ అది భౌతికమైన బలి. కాని మన బలి ఆధ్యాత్మికమైంది. అనగా మనం క్రీస్తునే బలిగా అర్పిస్తాం. మనం యేసుక్రీస్తుద్వారా తండ్రికి ప్రీతికరమైన ఆధ్యాత్మిక బలులను అర్పించే యాజకులం - 1షేత్రు 2,5. మనం కొలిచే క్రీస్తు యాజకుడు. దేవునికీ నరునికీ మధ్య ఏకైక మధ్యవర్తి - 1తిమె 2.5.
     మనం క్రీస్తులోనికి జ్ఞానస్నానం పొందినపుడు అతని లక్షణాలు మనకు గూడ సంక్రమిస్తాయి. కనుక అతని యాజకత్వం మనకు కూడ లభిస్తుంది. యాజకుడైన క్రీస్తునందు మనమందరమూ యాజకులమౌతాం. క్రైస్తవసమాజమంతా కలసే ఈ యాజకత్వాన్ని నిర్వహిస్తుంది. ఈ నిర్వహణం మూడురూపాల్లో వుంటుంది. 

1. క్రీస్తుద్వారా తండ్రికి స్తోత్రణలులు అర్పిస్తాం - హెబ్రే 13,15, అనగా మనం క్రీస్తుతో ఏకమై తండ్రికి పూజదిలి నర్చిస్తాం. ఈ బలిద్వారా తండ్రిని స్తుతించి కీర్తిస్తాం. ఎందుకంటే అతడు క్రీస్తుద్వారా మనలను రక్షించినవాడు.

2. పవిత్రమూ, దేవునికి ప్రీతిపాత్రమూ ఐన సజీవయాగంగా మనలను మనం దేవునికి అర్పించుకొంటాం. ఇది యుక్తమైన బలి - రోమా 12,1. పూర్వవేదంలో ప్రజలు జంతుబలుల నర్పిస్తే నూత్నవేదంలో మనలను మనమే బలిగా అర్పించుకొrటాం. పూర్వవేదంలోని యాగాలు చృతపశువులతో కూడి వుండేవి. మనం సజీవులంగానే దేవనికి అర్పించుకొంటాం. ఇక్కడ "సజీవయాగం' అంటే భావం యిది. మనం వట్టి