పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/95

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కలసిపోయారు - నిర్గ 12,38. కాని యెవరైనాసరే యూదజాతిలో చేరిపోతేనేగాని దైవప్రజలయ్యేవాళ్లు కాదు. పూర్వవేదానికి ఈ జాతి నియమం ముఖ్యం.నూత్న వేదప్రజకు జాతినియమం లేదు. 2. వివిధ నియమాలు, యిస్రాయేలీయులకు సున్నతి ఆచారముండేది. ఇదిలేందే ఎవడుకూడ దైవప్రజల్లో చేరలేడు. యిప్రాయేలీయుణ్ణి ఎవరైనా చంపితే హతుని దగ్గరిబంధువు హంతకుణ్ణి చంపివేయాలి - సంఖ్యా 35,19. ఎవడైనా సంతానంలేకుండా చనిపోతే అతని భార్య తన పెనిమిటి సోదరుని కూడి బిడ్డను కనవచ్చు. ఆబిడ్డ చనిపోయిన పురుషుని బిడ్డగా పరిగణింపబడతాడు. ఇదే దేవరన్యాయం - ద్వితీ 25, 5-6. అన్యజాతులను జూచి యిస్రాయేలీయులుకూడ రాచరికాన్ని ఏర్పాటు చేసికొన్నారు - 2సమూ 2,4 ఇంకా యూదులకు ధర్మశాస్త్రముండేది. ఇది వాళ్ళను క్రీస్తురాకడకు సిద్ధంచేసింది - గల 3.24 ఈలాంటి వివిధ నియమాలతో జీవించినవాళ్ళ యూదులు. 3.దేవుడు నడిపించాడు. యిప్రాయేలు పితరులు చాల తావులు తిరిగారు. ఆ ప్రజలు ఐగుప్తలో బందీలయ్యారు. ఆ దాస్యాన్నుండి తప్పించుకొని రాజులను చాలమందిని జయించి వాగ్దత్తభూమిని వశంచేసికొన్నారు. అక్కడినుండి మల్లా బాబిలోనుకు బందీలుగా వెళ్లారు. మల్లా తిరిగివచ్చి యెరూషలేమని పునర్నిర్మించుకొన్నారు. ఈ సుదీర్ఘచరిత్రలో ప్రభువే ప్రజలను నడిపిస్తూవచ్చాడు. అతని హస్తం ఆదుకోకపోయినట్లయితే వాళ్లు ఏనాడో, ఏ గండంలోనో చిక్కి అణగారి పోయివుండేవాళ్లు-యెష 68,8-14 4.వాగ్దత్త భూమి. ప్రభువు కనాను మండలాన్ని యూదులకు వారసంగా యిచ్చాడు. ఆభూమిని వాళ్ల పరమానందంతో భుక్తంచేసికొన్నారు. దేశ రాజధానియైన యెరూషలేములో వాళ్ళ దేవళముండేది. పండ్రెండు తెగలవాళ్ళ ఉత్సాహంతో ఆ దేవళానికి యాత్రలు చేసేవాళ్లు, అక్కడ దేవుణ్ణి కొల్చుకొనే వాళ్ళ - కీర్త 122, 1–4 వాగ్దత్తభూమి పేరుమీదిగా యెరూషలేము నగరం పేరుమీదుగా, దేవాలయం పేరు మీదిగా యూదులంతా ఐక్యమయ్యేవాళ్ళ 5. హీబ్రూభాష, యూదులకొక ప్రత్యేకమైన భాషవుంది. ప్రభువు తన పలుకులను ఈ భాషలోనే విన్పించాడు. ఆ పలుకులన్నిటినీ వాళ్ళగ్రంథస్థం చేసికొన్నారు. హీబ్రూభాషా, ఆ భాషలో వెలసిన బైబులు గ్రంథమూ ఆ ప్రజలకు ఐక్యతను చేకూర్చిపెట్టాయి.