పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/86

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మనదేశంలో ధనికులవద్ద బోలెడంత నల్లడబ్బు వుంది. ప్రభుత్వం లెక్కలోని కెక్కకుండా, పన్నుచెల్లించకుండా వుండే డబ్బును నల్లడబ్బు అంటారు. ఈలాంటి నల్లడబ్బు దేశంలో యాభైవేల కోట్లదాకావుంది. ఇది ధనవంతులు అక్రమంగా కూడబెట్టుకొన్నసామ్మ పేదలు డబ్బులేక బాధపడుతూంటే, ధనవంతులవద్ద ఈ నల్లడబ్బు నిష్ఫలంగా వండిపోతుంటుంది.

23. మనంకూడ సోదరుల కొరకు ప్రాణాలర్పించాలి — iయోహా 3,16



క్రీస్తు మనకొరకు ప్రాణాలర్పించాడు. ఆ ప్రభువు మనపట్ల చూపిన ప్రేమ అలాంటిది. క్రీస్తు ప్రేమను ఆదర్శంగా పెట్టుకొని మనంకూడ తోడి ప్రజలను ప్రేమించాలి. క్రీస్తులాగే మనంకూడ తోడి ప్రజలకొరకు ప్రాణాలు అర్పించాలి. ఇది యోహాను ఇచ్చిన సందేశం. తోడి ప్రజలకొరకు మనం ప్రాణాలను సమర్పించాలని దివ్యగ్రంథం చెపూంటే, దౌర్జన్యంతో ఇతరులకు ముట్టవలసింది కూడ మన కొట్టేస్తూండడం ఎంతటిపాతకం!

 ఈ దేశంలో వ్యాపారస్థలూ వర్తకులూ తూచే దొంగ కొలతలకూ కొలిచే దొంగ మానాలకూ అంతూపంతూ లేదు. వ్యాపారసులు వస్తువులను కొనుక్కొనే వాళ్లనుండి ఏటేట పదివేల కోట్ల రూపాయలు మోసంతో కొట్టేస్తూన్నారు. అందరూ పేదవాడి నోరుగొట్టి వృద్ధిలోనికి రావాలనుకొనేవాళ్లే, పెద్దచేప చిన్నచేవను బ్రిమింగివేసి తానింకా పెద్దదౌతూంటుంది. అలాగే ధనవంతులు పేదవాళ్ల కడుపుగొట్టి తామింకా ధనవంతులౌతూంటారు. ఇది తోడి ప్రజలకొరకు ప్రాణాలు సమర్పించడం గాదు, తోడిప్రజల ప్రాణాలు తీయడం, క్రీస్తుబోధకూ నరుల ప్రవర్తనకూ ఎంత వ్యత్యాసం!

24. నేను విూకు క్రొత్త ఆజ్ఞను ఇస్తూన్నాను - యోహా 13,34



ప్రభువు సోదరప్రేమను క్రొత్తఆజ్ఞ అని పేర్కొన్నాడు. పూర్వవేదం కూడ సోదరప్రేమను బోధిస్తుంది. కాని అక్కడ సోదరప్రేమను ఎందుకు పాటించాలో కారణం చెప్పలేదు. క్రీస్తు కారణం చెప్పాడు. ఏమిటి ఆకారణం? అతడు మనలను ప్రేమించినట్లే మనమూ ఒకరినొకరం ప్రేమించాలి. మన సోదరప్రేమకు కారణం ఆ క్రీస్తే, అతని ప్రేమే. అతని కొరకు మనం తోడి ప్రజలను ప్రేమించాలి, క్రీస్తు ఇచ్చిన ప్రేమాజ్ఞలోని నూతనత్వం ఇదే. ఇక, మనం ఎవరిని ప్రేమించాలి? అక్కరలో నున్న తొడి జనాన్ని ఆదుకోవాలి. విశేషంగా కూడూగుడ్డాయిలల్లా లేని పేద ప్రజలను ఆదుకోవడం సోదరప్రేమ ఔతుంది. ఇది మన అందరి కర్తవ్యం కూడా.

 మన దేశంలోని పిల్లలకు చాలినంత పోషకాహారం లభించడం లేదు. ఇండియాలోని మొత్తం ప్రజల్లో 15 ఏండ్ల లోపులో వున్న పసివాళ్లు 42 శాతం. అనగా