పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కేవలం వస్తువులు లేకపోవడంలోనే కాదు. హృదయంలో వండాలి. అనగా మన హృదయం సృష్టివస్తువులకు కాకుండ దేవునికి అంటి పెట్టుకొని వుండాలి.

మనదేశంలోని నేల పంపిణీని చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఈ దేశంలోని 70శాతం వ్యవసాయదారులకు ఒక్కొక్కరికి ఐదెకరాల లోపు భూమి మాత్రమే వుంది. కాని 10శాతం ఘరానా భూస్వాములు మాత్రం దేశంలోని మొత్తం సాగు నేలలో 56 శాతం నేలను స్వాధీనం చేసికొన్నారు. కనుక దేశంలోని సాగునేల కొద్దిమంది చేతుల్లోనికి వచ్చేసింది. పనిచేసికొనే రైతుకి నేల లేదు. కొంతమంది అగాయిత్యంతో దౌర్జన్యంతో నేలను స్వాధీనం చేసేసుకొన్నారు. కాకపోతే యింతమంది కూలీలు రెక్కలు విరుగగొట్టుకొంటూ రోజురోజూ వేరేవాళ్ల పొలాల్లోనే పని చేయడమెందుకు? పనిచేసి కొనేవాడికి ఎవడిపొలం వాడికి ఎందుకుండ కూడదు? దేవుడు భూమిని నరులందరి కొరకూ సృజింపలేదా?

8. ఓరీ బుద్ధిహీనుడా! ఈ రాత్రే నీవు చనిపోతావు - లూకా 12,20

క్రీస్తు ఓమారు ఓ సామెత చెప్పాడు. ఓ ధనవంతునికి సమృద్ధిగా పంటలు పండాయి. అతడు ధాన్యాన్ని భద్రపరచడం కోసం క్రొత్త కొట్ల కట్టిస్తా ననుకొన్నాడు. నేను అదృష్టవంతుడ్డి నాకు ఎంతకాలానికైనా సరిపోయ్యేంతగా సిరిసంపదలు అబ్బాయిగడా అనుకొన్నాడు, హాయిగా తింటూ త్రాగుతూ ఆనందిస్తాననుకొన్నాడు. కాని దేవుడు ఓరీ బుద్ధిహీనుడా! ఈ రాత్రే నేను నీ ప్రాణాలు తీసుకవెత్తాను. ఇక నీ సిరిసంపదలన్నీ ఏమౌతాయో చూద్దాం అన్నాడు. బైబుల్లో "బుద్ధిహీనుడు" అంటే దేవుణ్ణి లెక్కపెట్టనివాడు. దేవుడు ఉన్నాడని నమ్మినా తన నిత్యవ్యవహారంలో మాత్రం దేవుడు లేదో అన్నట్ల జీవించేవాడు. ధనికులు అందరూ కాకపోయినా చాలమంది ఈ వర్గానికి చెందినవాళ్లు.

దేవుడు నేలను నరులందరి కొరకూ కలిగించాడు అన్నాం. నరులందరూ ఆనేలమిూద కష్టంచేసి పొట్టపోసికోవాలనే దేవుని కోరిక. కాని కొందరు మాత్రం ఆన్యాయం నేలను తమ స్వాధీనం చేసికొన్నారు, దాన్ని వేరేవాళ్లకు దక్కకుండా చేసారు. ఇది పెద్ద అన్యాయం. దీన్ని చూచే మన ప్రభుత్వాలు నేలపంపిణీలు ప్రారంభించాయి. కాని ఎన్ని భూసంస్కరణలు జరిగినా పేదవాళ్ల చేతుల్లోకి మాత్రం అరెకరం నేలైనా రావడం లేదు, ఎక్కడికక్కడే మోసాలు చేసి, దొంగలెక్కలు తయారుచేసి ఆ వచ్చే నేలను కాస్త మధ్యలో ధనికులే కొట్టేస్తున్నారు. పేదవాడి నోటిలో మాత్రం దుమ్ము కొడుతున్నారు.