పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

5. ప్రేమను మాటల్లోకాదు చేతల్లో చూపించాలి - 1 యోహా 3,18

యోహాను తన మొదటి జాబులో మరోసంగతి చెప్పాడు. ఉన్నవాడు అవసరంలోవున్న పేదవాళ్ళను జూచి గూడ నిర్ణయతో వుండిపోయినట్లయితే, అతని హృదయంలో దైవప్రేమ వుంది అని చెప్పగలమా? కనుక ప్రేమ అంటే మాటలు చెప్పడంగాదు, చేతలు చూపించడం, మన దేశంలో చాలమందిలో ఈ చేతలనేవి లేవు. కనుకనే రోజురోజుకి పేద ప్రజల ఘోష మిన్ను ముట్టుతూంది.

6. నక్కలకు బొరియలూ పక్షులకు గూళూ వున్నాయిగాని - లూకా 9,58

పూర్వవేద కాలంనుండీ యిస్రాయేలు ప్రజల్లో ఓ వర్గంవాళ్లు “యావేకు చెందిన పేదప్రజలు" అనే పేరుతో పిలువబడేవాళ్ళు. వీళ్ల ప్రస్తుతః పేదవాళ్లు కావచ్చు, కాకపోవచ్చుగూడ, కాని వీళ్ల హృదయం మాత్రం ఐహిక వస్తువులకూ సిరిసంపదలకూగాక, దేవునికే అంటి పెట్టుకొనివుండేది. కష్టసుఖాల్లోను వీళ్లు దేవుని విూదనే ఆధారపడి జీవించేవాళ్ళు వీళ్లను హీబ్రూ భాషలో "హనవిమ్" అనిపిలిచేవాళ్ళు ఈలాంటి పేదవాళ్ల కోవకు చెందినవాడు క్రీస్త, అతని హృదయం ఐహిక వస్తువులకు వేటికీ అంటిపెట్టుకోలేదు. పక్షులకూ, మృగాలకూ నివాసస్థలాలైనా వున్నాయిగాని మనుష్యకుమారునికి తలదాచుకొనే తావైనా లేకపోయింది. ఈలాంటి పేదజీవితం జీవించిన క్రీస్తు పేదలను ఆదరంతో జూచాడు అంటే, పేదల కోప తీసికొన్నాడు అంటే ఆశ్చర్యమేమంది?

నరునికి కూడూ, గుద్దా, యిలల్లా కనీసావసరాలు. కాని మనదేశంలో పేదప్రజలకు కనీసావసరాలు కూడ తీరడంలేదు. చాలమందికి ఉండడానికి ఇండ్లకూడ లేవు. ఒక అంచనా ప్రకారం భారతదేశంలో ఇండ్లు లేనివాళ్లపల్లె ప్రాంతాలలోనే ఎనిమిది కోట్లదాకా వున్నారు. పెద్దపెద్ద పట్టణాల్లో వసించే వాళ్లలో సగంమంది మురికి వాడల్లోను పాడు గుడిసెల్లోను తల దాచుకొంటున్నారు. ఆరోగ్యకరమైన ఇండ్లు లేనివాళ్ళు అనతికాలంలోనే రోగాలగొట్టులై పోతుంటారు.

7. పేదలైన మిూరు ధన్యులు, దైవరాజ్యం విూది - లూకా 6,20

క్రీస్తు పేదప్రజల కోవకు చెందినవాడు అన్నాం. అతడు పేదజీవితం జీవించాడు అన్నాం, అతని సానుభూతి అంతా పేదప్రజలకే కనుక అతడు పల్కిన ధన్యవచనాల్లో ఓ • వచనం పేదప్రజల నుద్దేశించింది. పేదలు ధన్యులు అంటాడు ప్రభువు. ఎందుకంటే వాళ్లకు దైవరాజ్యం లభిస్తుంది. దేవునికి వాళ్లు ఇపులౌతారు. కాని ఈ పేదరికం అనేది