పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/76

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

3. నాకు ఈ ప్రజల విూద జాలి కల్లుతూంది - మార్కు 8.2

ఆనాటి యూదప్రజలు ప్రభువు బోధలు ఆలించి ఉత్సాహంతో అతని వెంట వెళ్ళారు. క్రీస్తు పలుకులు వింటూ మూడు రోజుల పాటు అతనితోనే వుండిపోయారు. కాని తినడానికి తిండి లేనందున ఆకలితో అలమటించిపోయారు. వాళ్ళను చూడగా క్రీస్తుకు జాలి కలిగింది, అతడు వాళ్ళకు అద్భుతంగా ఆహారం సంపాదించి పెట్టాడు. పేదసాదలనూ దిక్కుమొక్కూ లేనివాళ్ళనూ చూచి జాలిచెందడమనేది సాంఘిక సేవకు మొదటి మెట్ట, కరుణాహృదయుడు కానివాడు తోడి ప్రజలకు సేవ చేయలేడు.

మనదేశ జనాభా ప్రస్తుతం 100 కోట్లు అన్నాం. అనగా చదరపు మైలుకి 800 మంది ఔతారు, ప్రపంచం మొత్తాన్ని చదరపు మైళ్లుగా విభజించి ప్రపంచ జనాభాన్ని విభజించినట్లయితే ఒక్కో చదరపు మైలుకి 67 మంది మాత్రమే ఔతారు. అనగా మన దేశంలోని జనాభా సాంద్రత ప్రపంచజనాభా సాంద్రతకంటే 12 రెట్ల ఎక్కువ. ఈ జనాభా గూడ ఈమాత్రంగానే వుండిపోదు. ఏటేటికీ రెండున్నర శాతం పెరుగుతూంటుంది. ఇంత మంది జనంలో ధనికులెంతమంది, పేదలెంతమంది? ఉన్నవాళ్ళెంతమంది, లేనివాళ్ళెంతమంది? ఈ జనంపట్ల మనకు జాలి కలుగవద్దా?

4 సోదరసోదరీ జనం కూడూగుడ్డా లేక అలమటిస్తూంటే - యాకో 2,15

మన విశ్వాసమూ సత్ర్కియలూ కలిసిపోవాలిగాని, విశ్వాసమొక్కటే చాలదని చెప్తుంది యాకోబు జాబు. ఉదాహరణకు మన యిరుగుపొరుగు సోదరసోదరీ జనం కూడూగుడ్డా లేక అలమటించి పోతున్నారనుకొందాం. మనం వాళ్ళ జీవితావసరాలను తీర్చే ప్రయత్నం చేయాలి. అనగా సత్ర్మియలు చేయాలి. అంతేగాని "దేవుడు మిమ్మ దీవిస్తాళ్లే ! విూరు వెచ్చగా బట్టలు కప్పకోండి. హాయిగా భుజించండి" అని ఉపచార వాక్యాలు పలికితే ఏమి లాభం? కనుక తోడి ప్రజలను ప్రేమించడమంటే అక్కరలో నున్నవారిని మనకు చేతనైనంతగా ఆదుకోవడం.

కాని మనదేశ ప్రజలు అక్కరలో ఉన్నారా? ఉన్నారని మెల్లగా చెప్లే చాలదు. ఇండియాలో 20 శాతం ప్రజలకు, అనగా 20 కోట్ల మందికి, సగటు రోజువారి ఆదాయం 100 పైసలు మాత్రమే. వీళ్లంతా పేదలు మాత్రమే కాదు, పేదలకంటె క్రింది తరగతిలో నికృష్ణజీవితం జీవించేవాళ్లు, నానా వెతలూ, అగచాటూ పడుతూ బడుగు బ్రతుకులు • బ్రతికేవాళ్లు, వీళ్ల నుద్దేశించి మనకు చేతనైన సత్ర్కియలకు పూనుకోవాలి. క్రైస్తవుడికి విశ్వాసమూ ఆచరణమూ రెండూ వుండాలి.