పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

2. ధనికులైన క్రైస్తవులు

మనదేశ క్రైస్తవుల్లో అగ్రశ్రేణి ధనికులు అరుదు. కాని ఒకపాటి ధనికులు లేకపోలేదు. పేదప్రజల నడుమ ఎవరైనా కొద్దిపాటి సొత్తుగలవాళ్ళంటే వాళ్లు ధనికులుగానే గణింపబడతారు. ఈ దృష్టితో చూస్తే మన క్రైస్తవ సమాజాల్లో చిన్న స్థాయి ధనికులు చాలామంది తగులుతారు. ఈలాంటివాళ్లు డబ్బు విషయంలో ఏలా ప్రవర్తించాలి?

అల్పమానవులకు డబ్బువలన సులభంగా పొగరెక్కుతుంది. డబ్బులో పరపీడనశక్తి వుందని చెప్పాం. ధనవంతుడు తన ధనశక్తితో పేదవాణ్ణి బాధించడం మొదలిడతాడు. వాడికి ముట్టవలసింది తాను కొట్టేస్తాడు. వాణ్ణి బానిసను చేయబోతాడు. కనుక ధనశక్తితో తనకంటె క్రిందిస్థాయిలో వున్నవాళ్ళను పీడించడమనే దుష్కార్యాన్నుండి క్రైస్తవ ధనికుడు జాగ్రత్తగా తప్పుకోవాలి.

భక్తుడు ఇగ్నేప్యస్ లొయోలాగారు తాను వ్రాసిన తపోభ్యాసాలు అనే గ్రంథంలో పిశాచం నరులను శోధించే తీరును చక్కగా వివరించాడు. దయ్యం నరులకు మొదట డబ్బుమీద ಓಶಿನಿ పుట్టిస్తుంది. ఆ డబ్బును గడించినవాళ్ళకు ఈ లోకపు పదవులమీదా గౌరవప్రతిష్టలమీదా కాంక్ష పుట్టిస్తుంది. ఆ పదవులనుగూడ పొందినవాళ్ళకు విపరీతమైన గర్వం పట్టిస్తుంది. కనుక పిశాచం నరుణ్ణి సంపదలకూ, సంపదలనుండి పదవులకూ, పదవులనుండి గర్వానికీ నడిపిస్తుంది. కడన గర్వంద్వారా అతన్ని కూలద్రోస్తుంది. ఇగేష్యస్ పేర్కొన్న ఈ శోధనలకు క్రైస్తవ ధనికులు ఎందరు గురికావడంలేదు?

సంపన్న క్రైస్తవులు అవివేకియైన ధనికుని సామెతను గూడ జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి - లూకా 12, 16-21. ఏ ధనవంతుడూ తనకున్న సొమ్ముతో సంతృప్తి చెందడు. ఇంకా యొక్కువ డబ్బును కూడబెట్టుకోవాలని తాపత్రయ పడతాడు, ఈ తాపత్రయం అతనికి ఓ వ్యసనంగా పరిణమిస్తుంది. దానితో అతడు దేవుణ్ణి విస్మరిస్తాడు. భగవంతుణ్ణికాక తన సొత్తనే నమ్మకొని దానిమీదనే ఆధారపడి జీవిస్తాడు, దీనితో అతని పతనం ప్రారంభమైనట్లే ఈలా ధనవంతుడు పిచ్చెక్కినవాడిలాగ సొత్త కూడబెట్టుకొంటూనే ఎప్పడో, ఎక్కడో, తలవని తలంపుగా కన్నుమూస్తాడు. దేవుణ్ణి మాత్రం పోగొట్టుకొంటాడు. సంపన్నులు చాలమంది ఈలాగే నాశమయ్యారు, ఔతున్నారుకూడ ఓ విధంగా జెప్పాలంటే ధనవంతులైన వాళ్ళకి వచ్చే శోధనలన్నిటిలోను ఇది పెద్దది. ఇక, క్రీస్తు బోధలను జీర్ణం చేసికొని ధనలోభాన్ని అర్థం చేసికొన్న క్రైస్తవుడు మాత్రం ఈయనర్గానికి గురికాకూడదు.

తోడి నరుణ్ణి బానిసనుచేసి వాడ్డి మన స్వార్ణానికి వాడుకొనేలా చేసే దుష్టశక్తి సంపదలో వుంది. ధనికులైన క్రైస్తవులు ఈ దుష్టశక్తి నుండి జాగ్రత్తగా తప్పకోవాలి.