పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఈలాంటిదే కడతీర్పు కథ కూడాను. ఆ కథలో గొర్రెల్లాంటి వాళ్ళయిన సాధుపురుషులు పేదజనానికి అన్నంపెట్టారు. దాహం తీర్చారు. బట్టలిచ్చారు. ఇంకా నానా ఉపచారాలు చేసారు - మత్త 25, 35-40. ఈ కార్యాలన్నిటికీ వాళ్ళ సామ్మ ఖర్చయింది. మనకున్నదానిలో కొంత తోడిజనం కొరకు ఖర్చు పెట్టందే సోదరప్రేమలేదు. పేదసాదల ఆకలినీ, అనారోగ్యాన్నీ ఇక్కట్టలనూ తొలగించాలంటే మన డబ్బు కొంత సెలవు కావాలి, కాని డబ్బున్నవాళ్ళ తమ సొమ్మను సద్వినియోగం జేసికొనే మార్గం యిది.

విశేషంగా లూకా సువిశేషం మనం దానధర్మాలకు ఎక్కువ విలువనీయాలని చెప్తుంది. యుక్తిగల గృహనిర్వాహకుడు ఒకడున్నాడు. అతన్ని యజమానుడు లెక్కలు చెల్లించమని కోరాడు. అతనికి తన ఉద్యోగం ఊడుతుందని అర్థమయింది. కనుక అతడు వెంటనే తన యజమానునికి బాకీపడివున్న వారినందరినీ పిలిపించి తమ బాకీలను తగ్గించి వ్రాసికొమ్మన్నాడు. దానితో వాళ్లు అతనికి స్నేహితులైపోయారు. ఉద్యోగాన్ని పోగొట్టుకొన్నాక వాళ్లు అతన్ని ఆదరించారు — లూకా 16, 1-8. అన్యాయంగా సౌమ్మ గణించిన ధనవంతులు ఆ పాపపు సౌమ్మను దానధర్మాలకు సెలవు చేస్తే దేవదూతలు వాళ్ళకుగూడ స్నేహితులౌతారు. వాళ్ళను నిత్యనివాసమైన మోక్షానికి చేరుస్తారు - లూకా 16,9. డబ్బును కూడబెట్టుకోవడంలో తరచుగా అన్యాయాలు చేస్తూంటాం గనుక ఆ యన్యాయాలను తొలగించుకోవడానికి దానధర్మాలు చేయాలి అనే భావాన్ని ముందే చూచాం. లూకా సువిశేషం దానధర్మాలు చేసినవాళ్ళ ఉదంతాలు చాల పేర్కొంటుంది. రోమను సైన్యాధిపతి యూదులమీద ఆదరం జూపి తన సొంత సొమ్ముతోనే వాళ్ళకు ప్రార్థనా మందిరం కట్టిపెట్టాడు - 7,5, జక్కయ తన ఆస్తిలో సగం పేదలకు పంచియిచ్చాడు - 19, 8. పేత్రు జీవంతో లేపిన తబితా చాల సత్ర్కియలూ దానధర్మాలూ చేసింది - అచ 9, 36 రోమను సైన్యాధిపతియైన కొర్నేలి దానధర్మాలు చేసి దేవుని మన్నన పొందినవాడు - 10, 1-2 ఈ సందర్భాలన్నిటిని బట్టి లూకా హృదయాన్ని అర్థంచేసికోవచ్చు, ధనవంతులు తమ సొమ్మను పేదల కొరకు వినియోగించినపుడు దానిని సద్వినియోగం చేసినట్లవుతుంది, ఇక్కడ ఇంకో సంగతికూడ అర్థంచేసికోవాలి. పూర్వవేదంకాని, క్రీస్తుగాని డబ్బు దానియంతట అది చెడ్డదని ఎక్కడా చెప్పలేదు. అన్ని వస్తువుల్లాగే అదికూడ ఓ వస్తువు. అన్నిటిని లాగే దాన్నికూడ, వేపుడే చేసాడు. అది మంచిదే ఐయండాలి. కాని వచ్చిన చికేమిటంటే దానిలో అమోఘమైన శక్తివంది. నరులు దాని శక్తిని దుర్వినియోగం చేస్తారు.