పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

3.సంపదలు

బైబులు భాష్యం - 51

విషయసూచిక

1.పూర్వవేద బోధలు
2.క్రీస్తు బోధలు
3.తొలినాటి శిష్యుల బోధలు
4.నేటి క్రైస్తవ సమాజమూ సంపదలూ

1. పూర్వవేద బోధలు

పూర్వవేదం సంపదలను చిన్నచూపు చూడదుగదా, మెచ్చుకొంటుంది. సిరిసంపదలు దేవుని అనుగ్రహానికి చిహ్నమని కూడ చెప్పంది. కాని అన్యాయార్జితమైన విత్తాన్ని మాత్రం గర్షిస్తుంది. ఈ భావాలను క్రమంగా పరిశీలిద్దాం.

1. సంపదలు మంచివే

సంపదలు కూడబెట్టుకోవడం మంచిదేననే భావం పూర్వవేదంలో చాలచోట్ల కన్పిస్తుంది. యోబు కష్టాలూ పరీక్షలూ ముగిసాక ప్రభువు అతనికి మళ్లా సిరిసంపదలు కొల్లలుగా దయచేసాడు - యోబు 42, 10. దావీదు, యోషఫాత్తు, హిస్కీయా మొదలైన రాజులు దైవానుగ్రహానికి విశేషంగా నోచుకొన్నవాళ్ళు వీళ్ళంతా మహా ధనవంతులు - 2దిన 32, 27. దేవుడు తాను అంగీకరించినవాళ్ళకు ఐశ్వర్యాలు ప్రసాదిస్తాడు. అతడు అబ్రాహాముని పశుసంపదతో, వెండి బంగారాలతో తులతూగేలా చేసాడు - ఆది 13,2. ఈసాకు వెదపెట్టగా దేవుని దీవెనవలన నూరురెట్ల పంట చేతికి వచ్చింది - 26,12. యాకోబు మహా సంపన్నుడై దాసదాసీజనాన్నీ మందలనూ సేకరించుకొన్నాడు – 30, 43. దేవుడు తన ప్రజలకు ధారాదత్తంచేసే వాగ్దత్తభూమి నిస్సారమైంది కాదు, పాలు తేనెలు ప్రవహించేది - నిర్గ 3, 8.

సిరిసంపదలు అన్ని విధాలా మంచివే. అవి కలవాడు అడుక్కొని తిననక్కరలేదు - సామె 18,23. ధనవంతుడు తనవద్ద బాకీ పుచ్చుకొన్నవాళ్ళను దర్జాగా బానిసలనుగా ఏలవచ్చు - 227. అతనికి చాలమంది మిత్రులుకూడ ప్రోగౌతారు - సీరా 1321. ధనార్థన చేసినవాడు తెలివైనవాడు అనిపించుకొంటాడు - 24,4. లోకం