పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అనగా ఆత్మను ప్రసాదిస్తాడు. ఆ యాత్మడు మనకు క్రీస్తు అనుభవం కలిగిస్తాడు. క్రీస్తు ఇచ్చిన నీటిని త్రాగేవాడికి దప్పికలన్నీ తీరతాయి. ప్రభువు ఇచ్చే నీరు భక్తుని హృదయంలో ఓ నీటి బుగ్గగా పెంపుజెంది అతనికి నిత్యజీవాన్ని సంపాదించి పెడుతుంది - 4,14.

భూలోకంలోని పిల్లలు ఆకలైనపుడు తల్లిదండ్రులను అడుగుతారు. అమ్మానాన్నలు వాళ్ళకు చేప గ్రుడు మొదలైన భోజన పదార్ధాలు అందిస్తారు. అలాగే మనం కూడ పరలోకంలోని దేవుణ్ణి తన విూద మనకు కోర్కెపట్టించమని అడుగుకోవాలి. ఆ తండ్రి తన్నడిగిన వాళ్ళందరికీ ఆత్మను సమృద్ధిగా ప్రసాదిస్తాడు - లూకా 11,9-13, ఈ యాత్మే మనకు భగవంతుని విూద తృష్ణను పెంచేది.

ప్రభువు విూద మనకు కోర్కె పుట్టాలని వ్యక్తిగతంగా అడుగుకోవచ్చు. కాని వ్యక్తిగతమైన ప్రార్ధనం కంటె బృంద ప్రార్ధనం బలమైంది. వడకాలు సెమినార్లు మొదలైన వాటికి సమావేశమైన భక్తులు అంతా కలసి ఈ కోర్కె కోసం ప్రార్థనలు చేయాలి. ఇద్దరు ముగ్గురు ఏకమనసులై ప్రార్థిస్తే పరలోకం లోని తండ్రి ఆ మనవిని వింటాడు. ఇద్దరు ముగ్గురు ప్రభువు పేరిట సమావేశమైతే వాళ్ళ మధ్యలో అతడూ నెలకొని వుంటాడు - మత్త 18, 19–20.

3. కీర్తనకారుల అనుభవం

పూర్వవేదప కీర్తనకారులు మహాభక్తులు. ఆ విశుద్ధ హృదయులు నూత్న వేదపు పునీతులకు ఏ మాత్రమూ తీసిపోరు. వాళ్ళు ప్రభువుని గాఢంగా వాంఛించారు. అతని దర్శనభాగ్యం పొందారు కూడ. వాళ్ళ అనుభవాలను స్మరించుకొటే ఈనాడు మనకు కూడ ఆ భగవంతుని మిూద కోర్కెపడుతుంది.

"ప్రభుని ఒక్కవరం కోరుకొన్నాను
నాకు కావలసింది ఇదొక్కటే
నా జీవిత కాలమంతా ప్రభు మందిరంలో వసించాలనీ,
ఆయనను ప్రసన్నుణ్ణి చేసికోవాలనీ
దేవాయలంలో ఆయనను సంప్రతించి చూడాలనీ
నా కోరిక – 27,4

"ప్రభూ! దప్పిగొనిన దుప్పి
సెలయేటి నీళ్ళకు మల్లె
నా హృదయమూ నీకోసం తహతహ లాడుతూంది
సజీవుడైన దేవుని కోసం నా హృదయం తపించిపోతూంది