పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చేసింది. కనుక ఆమె తన జీవితాన్నేత్యాగంచేసింది అన్నాడు ప్రభువు - మార్కు 12,41- 43. భగవంతునికి కావలసింది మన హృదయాలు. కాని వస్తువులు కాదు. చాలమంది వాళ్ళ వస్తువులను దేవుడికిస్తారు గాని హృదయాలను ఈయరు. వాళ్ళ నిజమైన భక్తులు కాదు. కొందరు మాత్రం తమ హృదయాన్ని కూడ దేవునికి అర్పించుకొంటారు. వీళ్ళు చిత్తశుద్ధికల భక్తులు.

4. వేమన గొప్ప కవి, సంఘ సంస్కర్త, భక్తుడు. అతడు.
"ఆత్మశుద్ధిలేని యాచార మదియేల
భాండశుద్ధి లేని పాకమేల
చిత్తశుద్ధి లేని శివపూజ లేలయా"

అన్నాడు. మురికి కుండలో పరమాన్నం వండినా అది రుచించదు గదా! అలాగే అనిర్మల హృదయంతో భగవంతుణ్ణి ఆరాధిస్తే ఆయారాధనం దేవునికి ప్రియపడదు. చిత్తశుద్ధి లేకుండా ఏవేవో మతాచారాలు పాటిస్తూ కర్మకాండలు చేసికొంటూ పోతే మాత్రం ఏమిలాభం? కనుక హృదయశుద్ధి అన్నిటికంటె ముఖ్యమని వేమన భావం. మన క్రైస్తవుల్లో చిత్తశుద్ధి కల భక్తులు అరుదు. వినడానికి కటువుగా వున్నా ఈ వాక్యం చెప్పక తప్పదు. కనుక చిత్తశుద్ధి కోసం మనం ఆ ప్రభువనే మనవి చేసికోవాలి.

4. భగవంతుని విూద కోర్కె

1. భగవంతుని కొరకు దప్పిక గొనాలి

అందరు నరులూ భగవంతుణ్ణి మక్కువతో వాంఛించరు. కొందరు అతన్ని పట్టించుకొనే పట్టించుకోరు. మరికొందరు కష్టాలు వచ్చినపుడు మాత్రం అతన్ని స్మరించుకొంటారు. భగవంతుణ్ణి వాంఛించడమనేది ఓ భాగ్యం, ఓ గొప్పవరం. ప్రభువే ఆ వరాన్ని తన భక్తులకు ప్రసాదిస్తుంటాడు.

ప్రభువు దప్పిక కల్గినవాడు నావద్దకు వచ్చి దప్పిక తీర్చుకోవచ్చు. నన్ను విశ్వసించే వాని అంతరంగంలో నుండి జీవజల ప్రవాహాలు పొంగిపారతాయి" అన్నాడు. ఈ జీవజల ప్రవాహం పరిశుద్ధాత్మే - యోహా 7,37-39. కొందరికి ఆ భగవంతుని విూద కోరిక పడుతుంది. అతనిమిద దప్పిక కలుగుతుంది. ఈ దప్పికను మనంతట మనం తీర్చుకోలేం. కనుక ప్రభువు తనలోని జీవజలాలను మనలోనికి పొంగిపారేలా చేస్తాడు. ఈ జీవజలం పరిశుద్ధాత్మే అనగా ఆత్మక్రీస్తు హృదయంలో నుండి మన హృదయం లోనికి ప్రవేశిస్తుంది. అలా ప్రవేశించి. మన హృదయంలో ఆ ప్రభువు మిద కోర్కెను పెంచుతుంది. ఇక, ఆ