పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అంతా మన ఆలోచనలను బట్టి వుంటుంది. మన తలపులు పవిత్రంగా వుంటే క్రియలు కూడ పవిత్రంగా వుంటాయి. లేకపోతే లేదు. ఈ తలపులు హృదయం నుండి పుడతాయి. కనుక కీలకమంతా హృదయంలోనే వుంది. హృదయాన్నిబట్టి నరుడు నైతిక మానవుడుగా గాని అనైతిక మానవుడుగా గాని తయారౌతాడు.

ప్రభువు హృదయాన్ని గూర్చి చెప్పిన సంగతులు ఇంకా వున్నాయి. మన హృదయాన్నిబట్టే మన మాటల తీరు కూడ వుంటుంది - మత్త 12,34. కనుక అనిర్మల హృదయుడు నిర్మలంగా మాట్లాడలేడు. ఐతే విశుద్ధ హృదయులకు దేవుడు సాక్షాత్కరిస్తాడు - మత్త 5,8. లోకంలోని జనం తమ శక్తిసామర్థ్యాలను నమ్మకొంటారు. తామెవరి మీదా ఆధారపడనక్కరలేదు అనుకొంటారు. కనుక వాళ్లు అహంకారం తోను గర్వంతోను పొంగిపోతారు. కాని క్రీస్తు అలాంటివాడు కాదు. అతడు వినయశీలుడు, వినమ్ర హృదయుడు. నిత్యమూ తన తండ్రిమాద ఆధారపడి జీవించేవాడు. ఆ క్రీస్తు అడుగుజాడల్లో నడిచే భక్తులు కూడ అతనిలాగే వినయాత్మలు కావాలి - మత్త 11,29. ఉత్థానానంతరం ఎమ్మావు గ్రామంలో ప్రభువే స్వయంగా శిష్యుల హృదయాలకు వెలుగును ప్రసాదించాడు. ఆ శిష్యులు "ప్రభువు మనకు లేఖనాలను వివరించి చెప్పినపుడు మన హృదయాలు భక్తిభావంతో ప్రజ్వరిల్లాయి కదా" అనుకొన్నారు — లూకా 24,32. ఈ విధంగా ఆ ప్రభువు మన హృదయాలను జ్ఞానజ్యోతితో నింపుతాడు.

ఈనాడు మనలను రక్షించేది యేమిటి? ఉత్థాన క్రీస్తుని మనం హృదయంలో విశ్వసిస్తే అప్పడు మనకు రక్షణం కలుగుతుంది - రోమా 10,9. క్రీస్తు మొదట తన ఆత్మను నరుల హృదయంలోకి ప్రవేశపెడతాడు. ఈ యాత్మద్వారా మనం క్రీస్తుని విశ్వసిస్తాం. ఈ యాత్మద్వారానే మనం పరలోకం లోని దేవుణ్ణి తండ్రీ అని పిలుస్తాం. ఆ తండ్రి పంపిన కుమారుడు క్రీస్తుని విశ్వసిస్తాం - గల 4,6. ఇంకా ఈ యాత్మ మన హృదయాన్నిదేవుని ప్రేమశక్తితో నింపుతుంది కూడ. ఈ శక్తితోనే మనం తండ్రినీ అతడు పంపిన కుమారుణ్ణీ, తోడి ప్రజలనీ కూడ ప్రేమించగల్లుతూన్నాం - రోమా 5,5.

సిలువ విూద వ్రేలాడుతున్న క్రీస్తుని ఈటెతో పొడిచి అతని హృదయాన్ని తెరచారు - యోహా 19,34. ఆ విశుద్ధ హృదయం మన హృదయాల విూద సోకి వాటిని పునీతం చేయాలి. కనుక క్రీస్తు హృదయంలో నుండి మన హృదయం లోనికి జీవజలాలు ప్రవహించాలి. ఈ జీవజలాలు ఏమో కాదు, పరిశుద్ధాత్మే. అనగా క్రీస్తు హృదయం నుండి బయలుదేరే ఆత్మ మన హృదయాల్లోకి ప్రవేశించి వాటిని పునీతం చేస్తుంది - యోహా 7,38-39.అంటే ఉత్థాన క్రీస్తు అతని ఆత్మా మన హృదయాలను శుద్ధి చేస్తారని