పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తెలిసికొన్నారు - 6,5. కాని వాళ్ళ హృదయాలు మాత్రం అందుకు సిద్ధంగా లేవు. అవి అవిధేయతతో దేవుని విూద తిరుగుబాటు చేసే హృదయాలు - యిర్మీ 5,28. దుష్ట హృదయాలు కూడ - 7,24. కనుకనే యిస్రాయేలీయుల్లో భక్తులైన మహానుభావులు హృదయశుద్ధి కొరకు ప్రార్థించారు. ఈలా జపించినవాళ్లల్లో 51వ కీర్తన వ్రాసిన భక్తుడు స్ఫటికం లాంటి మనసు కలవాడు. ఇతడు

"దేవా! నాలో నిర్మల హృదయాన్ని సృజించు
ఓ క్రొత్త అంతఃకరణాన్ని నాలో నెలకొల్పు
నీ సన్నిధి నుండి నన్ను గెంటివేయకు
నీ పరిశుద్ధాత్మను నాయొద్ద నుండి తీసివేయకు"

అని మనవి చేసాడు - 51.10-11. ఇది చాల చిత్తశుద్ధి కల ప్రార్ధనం. ఇంకా ఈ భక్తుడు

"నేను సమర్పించుకొనేబలి పశ్చాత్తాప హృదయమే
పశ్చాత్తాపంతో సంతాపపడే హృదయాన్ని
ప్రభూ! నీవనాదరం చేయవు"

అని నుడివాడ - 51, 17. ఈ వాక్యం ప్రకారం అన్ని బలుల కంటె పశ్చాత్తాప పూరితమైన హృదయమే శ్రేష్టమైన బలి. హృదయంలో మాలిన్యం పెట్టుకొని దేవునికి ఏమియిస్తే మాత్రం ఏమి లాభం? పైగా మనకున్న వాటిని భగవంతునికి ఈయడం తేలికే. కాని మన హృదయాన్ని ఈయడం కష్టం.

4. నూత్న హృదయం

భక్తుల హృదయ శుద్ధికొరకు మనవి చేసారు అన్నాం. శుద్ధిగల హృదయం నూత్న హృదయం. కనుక బైబులు చాల తావుల్లో నూత్న హృదయాన్ని ప్రస్తావిస్తుంది. ప్రభువు భక్తులకు నూత్న హృదయాన్ని దయచేస్తాడని ప్రవక్తలు వాగ్దానం చేసారు. పూర్వకాలంలోనే మోషే "ప్రభువు విూకూ విూ సంతానానికీ విధేయాత్మకాలైన హృదయాలను దయచేస్తాడు" అని యిప్రాయేలీయులకు మాట యిచ్చాడు - ద్వితీ 30,6. ప్రభువు యిస్రాయేలు ప్రజతో క్రొత్త నిబంధనం చేసికొంటాడనీ, అప్పడు తన ధర్మవిధులను పాళ్ల హృదయాలవిరాదనే లిఖిస్తాడనీ, తాను వాళ్లకు దేవుడు కాగా వాళ్ళ అతని ప్రజలౌతారనీ యిర్మీయా వాకొన్నాడు — 31-33. పూర్వ నిబంధనంలో ప్రభువు తన ధర్మశాస్రాన్ని రాతిపలకలమిద వ్రాసి యిచ్చాడు. ఈ క్రొత్త నిబంధనంలో తన విధులను నేరుగా నరుల హృదయాల విూదనే వ్రాస్తాడు. ఫలితంగా ప్రజలు ఎక్కువ చిత్తశుద్ధితో జీవిస్తారని