పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

"

నరుని హృదయాన్ని ఎవడు అర్థం చేసికోగలడు?
 హృదయానికున్నంత కపటం దేనికీ లేదు
 అది ఫరోరవ్యాధితో కుమిలిపోతుంటుంది
 దాని రోగాన్ని కుదర్చలేం
 ఐనా ప్రభువైన నేను నరుని మనస్సునీ
 హృదయాన్నీ పరిశీలించి చూస్తుంటాను
 ప్రతి నరుజ్జీ అతడు జీవించే తీరును బట్టీ,
 పనిచేసే రీతిని బట్టీ, సంభవిస్తూంటాను"
 అంటాడు– 17,9–10. ఈ వాక్యాల్లో చాల సత్యముంది. ఒకోమారు మన హృదయం మనకే అర్థంకాదు. ఇక వేరేవాళ్ళ హృదయం ఏమి అర్థమౌతుంది? అలాంటప్పుడు అందరి హృదయాలనూ పరిశీలించేవాడూ, అర్థం చేసికొనేవాడు, ఆ ప్రభువొక్కడే.
 మనం ఆ ప్రభువుని చిత్తశుద్ధితో ఆరాధిస్తున్నామో లేదో కూడ అతనికి తెలుసు. కనుకనే ప్రభువు యెషయా ప్రవక్త ద్వారా
 “ఈ ప్రజలు నన్ను పెదవులతో మాత్రమే గౌరవిస్తున్నారు
 వీళ్ల హృదయాలు నాకు చాల దూరంగా వున్నాయి"
 అని పల్మాడు - 29,13. ఈ వాక్యాన్ని ಬಣ್ಣಿ భక్తిమంతులుగా చూపట్టేవాళ్ళల్లో గూడ కొందరు కపట భక్తులేనేమో అని శంకింపవలసి వుంటుంది.
 ఇంకా, దేవుని వాక్కు ఓ కత్తిలాగ మన హృదయాన్ని నరుకుకొని లోపలికి పోతుంది. ఆ హృదయంలోని ఆశలనూ ఆలోచనలనూ పరిశీలించి చూస్తుంది - హెబ్రే 4, 12. ఇక్కడ దేవుని వాక్కు అంటే దేవుడే దేవుడు మన హృదయంలోకి ప్రవేశిస్తాడనీ, ఒ న్యాయమూర్తి లాగ దాని మంచిచెడ్డలను పరీక్షించి చూస్తాడనీ ఈ వాక్యం భావం, కనుక మనం నరుల కన్నుగప్పగలం గాని దేవుని కన్ను కప్పలేం. "పాతాళ లోకం గూడ ప్రభువుకి తెలియంది కాదు అంటే, నరుని హృదయం లోని ఆలోచనలు అతనికి తెలియకుండా వుంటాయా" అంటుంది సామెతల గ్రంథం - 15, 11. ఈలాంటి వాక్యాలన్నిటిని బట్టి ప్రభువు మన హృదయాలను నిశితంగా పరీక్షిస్తాడని తెలిసికోవాలి. ఆ ప్రభువు ప్రధానంగా హృదయజ్ఞడు.

3. హృదయశుద్ధి అవసరం


యిప్రాయేలీయులు ప్రభువుని పూర్ణ హృదయంతో వెతకాలని అర్థం చేసికొన్నారు - ద్వితీ 4,29. అతన్ని పూర్ణ హృదయంతోను పూర్ణ మనస్సు తోను ప్రేమించాలని 40