పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

<poem>కుమారులున్నారని గొప్పలు చెప్పకుంటాడు. అనగా తాను దేవుని మన్ననకు పాత్రుడనయ్యానని అతని భావం - ఎస్తే 5,11.

 యిస్రాయేలు సమాజంలో స్త్రీకి స్త్రీగా విలువుండేది కాదు. సంతానాన్ని కంటేనే ఆమెకు విలువ. బిడ్డలు లేని ఉవిద లెక్కలోనికి వచ్చేది కాదు. అబ్రాహాము భార్య సార, ఆమె దాసి హాగారు. ప్రభువు హాగారుకి బిడ్డనిచ్చి సారను గొడ్రాలిని చేసాడు. హాగారు తాను గర్భవతి కావడం చూచి యజమానురాలినే చిన్నచూపు చూచింది. ఎందుకంటె సార గొడ్రాలు కనుక - ఆది 16, 4. ఇంకా, ఎల్మానాకు అన్నా పెనిన్నా అని యిద్దరు భార్యలు. పెనిన్నాకు బిడ్డలు పుట్టారు గాని అన్నా గొడ్రాలుగా వండిపోయింది. కనుక పెనిన్నా సవతియైన అన్నాను దెప్పిపొడిచింది - 1సమూ 1,6. ఈలాంటి సందర్భా లన్నిటిలోను సంతానం లేని స్త్రీకి విలువ లేదని అర్థం చేసికోవాలి. పూర్వకాలంలో తండ్రే పిల్లలకు ఉపాధ్యాయుడుగా వ్యవహరించేవాడు. పిల్లలకు విద్యాబుద్దులు నేర్పడం అతని బాధ్యత. ఈ బాధ్యతను బైబులు చాల తావుల్లో గుర్తుకు తెస్తుంది.

<poem>"కుమారుని శిక్షింపని తండ్రి వానిని ద్వేషించినట్లే
కుమారుని ప్రేమించే తండ్రి
వానిని శిక్షించి తీరుతాడు - సామె 13, 24

విజ్ఞాన గ్రంథకారులు ఈలాంటి నీతులు చాల చెప్పారు. ఇక, పిల్లల తరపున పిల్లలు కూడ తల్లిదండ్రులకు విధేయులై యుండాలి, పిల్లలు తల్లిదండ్రులను గౌరవించాలి అనేది పదియాజ్ఞల్లో ఓ యాజ్ఞ - నిర్గ20,12. సామెతల గ్రంథకర్త"కుమారా! నీ తల్లిదండ్రుల ఉపదేశాన్ని ఆదరంతో ఆలించు. సుందరమైన తలపాగాగాని ముత్యాలహారం గాని నీ రూపానికి వన్నె తెచ్చినట్లే తల్లిదండ్రుల ఉపదేశం గూడ నీ శీలానికి మెరుగు తెస్తుంది సుమా!" అని నుడివాడు-1, 8-9, ఇది చాల చక్కని హితబోధ తల్లిదండ్రులను కొట్టిన వారికి, వాళ్ళను తిట్టి శపించిన వాళ్ళకీ మరణశిక్ష విధించాలి అంటుంది నిర్గమకాండం - 21,15-17, ఈ సందర్భంలో ఓ సంఘటనం గుర్తుకు వస్తుంది. ఎలీషా ప్రవక్త యెరికో నుండి బేతేలుకు ప్రయాణం చేస్తూండగా త్రోవలో కొంతమంది ఆకుదాయపు పిల్లలు అతన్ని గేలిచేసారు. అతని వెంటబడి “పోపో బట్టతలకాయా!" అని ఎగతాళి చేసారు. ప్రవక్త కోపించి వాళ్ళను శపించాడు. వెంటనే అడవిలో నుండి రెండు ఆడు ఎలుగుబంటులు వెడలి వచ్చి నలువది యిద్దరు పిల్లలను ముక్కముక్కలుగా చీల్చివేసాయి. 2రాజు 2,23-24 పిల్లలు పెద్దలను అవమానించగూడదని ఈ పట్టున గ్రంథకర్త ఉద్దేశం.

</poem> </poem>