పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

4. చిన్నబిడ్డల్లా ప్రార్థన చేయాలి

మనం ప్రార్ధనం చేసేపుడు చిన్నబిడ్డల్లా మెలగాలి. అనగా దేవుని విూద ఆధారపడి అతన్ని మనవి చేసికోవాలి. క్రీస్తు శిష్యులకు పరలోక జపం నేర్పిస్తూ దేవుణ్ణి "తండ్రీ" అని సంబోధించి జపం చేయమని చెప్పడు — లూకా 11,2. ఇక్కడ మూలభాషయైన అరమాయిక్లో తండ్రి అనే పదానికి క్రీస్తవాడిన శబ్దం "అబ్బ". ఇది తెలుగు మాట కాదు, అరమాయిక్ మాట. క్రీస్తునాడు యూదకుటుంబాల్లోని చిన్నబిడ్డలు వాళ్ళ నాన్నలను "అబ్బ" అని సంబోధించేవాళ్ళట. కనుక ఇది నేడు మన పిల్లలు వాడే "నాన్న అనే పదం లాంటిది. కాబట్టి క్రీస్తు దేవుణ్ణి “నాన్న" అని సంబోధించమన్నాడు అనుకోవాలి. అనగా ఆ దేవుని పట్ల మనకు అంత చనువూ నమ్మకమూ ఏర్పడాలని భావం. మనం చిన్న బిడ్డల్లాగా దేవునికి ప్రార్థన చేయాలి.

ఇంకా అతడు ఓ వుపమానం చెప్పాడు. భూలోకంలోని తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డలు ఆకలై అన్నం పెట్టమంటే ఏంచేస్తారు? ఆ కుమారులు చేపనడిగితే పామునిస్తారా? గ్రుడునడిగితే తేలు నిస్తారా? వాళ్ళకుపయోగపడే గ్రుడు చేపలాంటి మంచి వస్తువుల నిస్తారు గాని హానికరమైన పాము, తేలులాంటి వాటిని ఈయరు కదా? అలాగే మనం కూడ పరలోకంలోని తండ్రిని అడుగుకొంటే అతడు మంచివస్తువులనే ఇస్తాడు గాని హానికరమైన వాటిని ఈయడు కదా - లూకా 11,11-13. అనగా పిల్లలు తల్లిదండ్రులను లాగే మనం కూడ నమ్మకంతో దేవుడ్డి అడుగుకోవాలని భావం. అంటే మనం ప్రార్ధనంలో చిన్న పిల్లలంగా తయూరు కావాలని అర్థం.

ఇక్కడ క్రీస్తు బోధల్లో చిన్నబిడ్డలను గూర్చిన అంశాలను నాల్డింటిని పరిశీలించాం. అతని వుపదేశాల్లో ఈలాంటి భావాలు ఇంకా వున్నాయి. ఏమైతేనేమి, ప్రభువు బాలలను ఆదరాభిమానాలతో చూచాడు అనేది ప్రధాన సత్యం. మనం కూడ ఈ క్రీస్తు మనస్తత్వం అలవర్చుకొని బాలలను ప్రేమాభిమానాలతో చూస్తే ఎంత బాగుంటుంది!

3. తల్లిదండ్రులూ, పిల్లలూ

ఈ సందర్భంలో తల్లిదండ్రులకూ పిల్లలకూ వుండే సంబంధాన్ని గూర్చి కూడ కొద్దిగా ముచ్చటించాలి, యిప్రాయేలు తల్లిదండ్రులు సంతానాన్ని మక్కువతో వాంఛించారు అని చెప్పాం. సంతానం దేవుని దీవెనకు తార్మాణంగా వుండేదని చెప్పాం. న్యాయాధిపతియైన గిద్యోనుకు డెబ్బదిమంది కుమారులు కలిగారు - న్యాయా 8,30. ఈ సంగతి చెప్పడంలో గ్రంథకర్త ఉద్దేశం, గిద్యోను దేవుని ఆశీర్వాదాన్ని పొందాడని తెల్పడమే. ఇంకా అహష్వేరోషురాజు మంత్రియైన హామాను తనకు పదిమంది