పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

యావనప్రాయంలో పట్టిన పిల్లలు

యోధుని చేతిలోని బాణాల వంటివాళ్ళ

అట్టి బాణాలతో అమ్ములపొది నింపుకొనేవాడు ధన్యుడు"

అంటాడు – 1273-5. అనగా బిడ్డలు తండ్రికి బాగా ఉపయోగపడతారని భావం, మరో కీర్తనకారుడు గృహస్తుని దీవిస్తూ

“నీ లోగిట నీ భార్య ఫలించిన ద్రాక్షలతలా వుంటుంది

భోజనపు బల్ల చుట్టు పిల్లలు

ఓలివు మొక్కల్లా కన్పిస్తారు"

అన్నాడు - 128,3-4 ఇక్కడ సంతానవతియైన భార్యను గుత్తులు వ్రేలాడే తీగతోను, పిల్లలను ఓలివు మొక్కలతోను పోల్చాడు. ఇది రమ్యమైన ఉపమానం.

బిడ్డలు లేని దంపతులకు తీరని వ్యధి కలిగేది. అబ్రాహము సంతానం కలగనందున చాల బాధపడ్డాడు. ఓమారు ప్రభువు అతనికేదో బహుమానాన్ని ఇస్తానని చెప్పగా అబ్రాహాము "ప్రభూ! నీవు నాకు ఏమియిస్తే మాత్రం ఏమిలాభం? నేను బిడ్డపాప లేనివాడనై పోయానుగదా!" అని విలపించాడు - ఆది 15,2. అలాగే బిడ్డలు కలుగనందున ఎల్మానా భార్యయు గొడ్రాలునైన అన్నా కుమిలిపోయింది. "ప్రభూ! నాకొక మగకందును ప్రసాదించావంటే ఆ బిడ్డను ఆమరణాంతం నీకే సమర్పించుకొంటాను. మంగలికత్తి వాని తలవెండ్రుకలను తాకదు" అని మొక్కుకొంది -1సమూ 1,11. యాకోబు చిన్న భార్యరాహేలుకు చాలకాలం వరకు సంతానం కలగలేదు. ఆమె "నాకు పిల్లలను పట్టిస్తావా లేక ఏ నుయ్యో గొయ్యో చూచుకొమ్మంటావా" అని భర్తను పీడించింది - ఆది 30;1. యూదదంపతులు పిల్లలను కోరుకునేతీరు ఈలావుండేది.

పిల్లలు కూడ ఆరాధనలో పాల్గొని దేవనిస్తుతింపగలరు. వాళ్ళస్తుతి భగవంతునికి ప్రియపడుతుంది. కనుకనే కీర్తనకారుడు

"చిన్నబిడ్డలూ, చంటిబిడ్డలూ నిన్ను స్తుతిస్తారు"

అన్నాడు - 8,2. ఈ భావం క్రీస్తుకి బాగా నచ్చింది. అందుకే అతడు ఈ వాక్యాన్ని తన బోధల్లో ఉదాహరించాడు - మత్త 21, 16.

పూర్వవేదంలో ప్రభువు ముగ్గురు బాలురను తన దూతలనుగా ఎన్నుకొన్నాడు. ఈ ముగ్గురు ప్రభువు తరపున ప్రజలకు రక్షకులుగా వ్యవహరించారు. వాళ్లు సమూవేలు, దావీదు, దానియేలూ.

బాలుడైన సమూవేలు షిలో దేవాలయంలో పెరుగుతూ ఏలి అనే పెద్ద గురువుకి పరిచర్యలు చేస్తుండేవాడు. ఓనాటి రాత్రి అతడు దేవళంలో మందసం చెంత పండుకొని