పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

2.నాల్గు బైబులు భావాలు

                                                  బైబులు భాష్యం - 41

విషయసూచిక

1. బాలలు

2. దేవుని పోలిక

3. హృదయం

4. భగవంతుని విూద కొర్కె

1.బాలలు

1. పూర్వవేదం

పూర్వవేదం బాలలను బుద్ధిహీనులనుగా భావిస్తుంది. వాళ్ల క్రమశిక్షణకు లోబడి వండాలని చెప్పంది. సామెతల గ్రంథకర్త.

"బాలలు హృదయంలో మూర్ఖత్వం స్వాభావికంగానే వుంటుంది కాని దండనం ద్వారా దానిని తొలగించవచ్చు"

అంటాడు - 22, 15. యూదులు పిల్లలను అంత గౌరవ భావంతో చూడలేదోమో ననిపిస్తుంది. వాళ్ళ సంప్రదాయం ప్రకారం చిన్నపిల్లలూ, స్త్రీలూ, బానిసలూ ఒకే శాఖకు చెందుతారు. ఈ మువ్వరికీ హక్కులు లేవు, సమాజంలో స్థానం లేదు. కనుక పిల్లలను తల్లిదండ్రులూ, భార్యలను భర్తలూ, బానిసలను యజమానులూ తమ యిష్టం వచ్చినట్లు చేయవచ్చు.

ఐనా యూదులు చిన్న బిడ్డలను ప్రేమించి ఆదరంతో చూడకపోలేదు. తల్లిదండ్రులు బిడ్డలను దేవుని వరంగాను దీవెన గాను భావించారు. కయీను పట్టినపుడు ఏవ "దేవుని తోడ్పాటు వలన నాకో బిడ్డ కలిగాడు" అనుకొంది - అది 4,1. అనగా ఆమె ఆ శిశువును దేవుని వరంగా భావించింది. అలాగే కీర్తనకారుడు

"బిడ్డలు దేవుడిచ్చే వరం

వాళ్ల ప్రభువు.దయచేసే బహుమానం