పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కాని ఈ ప్రవచన వరం నేడు మనకు ఏమి మేలు చేసి పెడుతుంది? అది పూర్వం యిప్రాయేలు సమాజానికీ, తొలి శతాబ్దం లోని క్రైస్తవ సమాజానికీ ఏమి మేలు చేసిపెట్టిందో నేడు మనకూ అదే మేలు చేసిపెడుతుంది. ఈ సందర్భంలో పౌలు "ప్రవక్త ప్రజలకు అభివృద్ధినీ, ప్రోత్సాహాన్నీ ఆదరాన్నీ చేకూర్చి పెడతాడు" అన్నాడు - 1కొ 14,3. ప్రవచనం నేడు మనకు విశేషంగా చేసే మేలు, ప్రోత్సాహం, కనుక ఈ యంశాన్ని కొంచెం విపులంగా పరిశీలించి చూద్దాం.

2. నేడు

నేడు ప్రపంచంలో ప్రధానమైంది సాంఘిక సమస్య అనగా ధనవంతులు దరిద్రులను దోచుకోవడం. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా రెండువంతులు పేదలూ ఒక వంతు ధనికులూను. కాని ఈ ఒక వంతు సంపన్నులు రెండువంతులు దరిద్రులను పీడించి పిప్పి చేస్తున్నారు. దేవుడే గనుక ఈనాడు పేదవాడికి దర్శనమిస్తే రొట్టెరూపంలో దర్శనమిస్తాడు అన్నాడు గాంధి. కనుక ప్రభువు ఈనాడు పేదవాణ్ణి ప్రోత్సహించడానికి తన ప్రవచన వరాన్నివాడుకొంటాడని ఊహించుకోవచ్చు. అందుచేత మనం పదిమందిమి ప్రోగైనప్పడు ఈ వరాన్ని వినియోగించుకొని ఒకరినొకరం ప్రోత్సహించుకొంటూండాలి.

ఓ పెద్ద హైస్కూల్లో అరవైమంది ఉపాధ్యాయినులున్నారు. కాని వాళ్ల ధనవంతుల పిల్లలను మన్ననతో చూస్తూండేవాళ్ళ బళ్ళ విద్యార్థులకు లభించే ఉద్యోగాలూ పదవులూ అన్నీ ఈ పిల్లలకే అంటగడుతూండేవాళ్ళ పేద విద్యార్థులను మాత్రం బొత్తిగా పట్టించుకొనే వాళ్ళు కాదు.ఆ స్కూలుకి ఓ సిస్టరు ప్రధానోపాధ్యాయిని. ఓమూరు ఆమె ఉపాధ్యాయినులందరినీ ప్రోగు జేసి “మనం కూడ ధనవంతుల పిల్లలను మాత్రమే పరామర్శిస్తే ఇక పేద పిల్లలను పట్టించుకొనేదెవరు? విూరు విందుచేసికొనేపడు పేదలనూ కుంటిపారినీ గ్రుడ్డివారినీ వికలాంగులనూ పిలవండి. వాళ్ళ విూకు ప్రత్యుపకారం చేయలేరు కనుక విూరు ధన్యులౌతారు - అనే ప్రభువాక్యం వుంది కదా? కనుక మనం ధనికులను వెళ్ళగొట్ట నక్కరలేదు కాని పేదలను మాత్రం ప్రత్యేక శ్రద్ధతో పరామర్శించాలి" అని హెచ్చరించింది. దానితో ఆ స్కూలులోని ఉపాధ్యాయినుల దృక్పథం మారిపోయింది. వాళ్ళు పేదపిల్లలను పట్టించుకోవడం మొదలుపెట్టారు. ఇక్కడ ఈ సిస్టరు చెప్పింది ప్రవచనమే. ఈ ప్రవచనం వలన ఈ స్కూలులో సాంఘిక న్యాయం చేకూరింది.

ఈలాగే మనలో ఎవరైనా ప్రవచనాన్నివాడుకొని మన చుటూరా జరిగే సాంఘిక అన్యాయాలను ఎత్తి చూపించవచ్చు. ఆ యన్యాయాలను సవరించుకొమ్మని అందుకు కారకులైన వ్యక్తులను హెచ్చరించవచ్చు, మందలించవచ్చు. కాని యిక్కడ ఓ అంశం