పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఈలా ప్రజలు దేవని విూద తిరుగుబాటు చేయడమూ, అతడు పంపిన ప్రవక్తలు విన్పించే సందేశాన్ని లక్ష్యం చేయక పోవడమూ పూర్వవేదంలో చాలచోట్ల కన్పిస్తుంది. ప్రవక్త ప్రధానంగా దేవుని సందేశాన్ని విన్పించేవాడని చెప్పాం. మరి ప్రజలు ఆ సందేశాన్ని వినకపోతే అతనికి ఎంత బాధ కలుగుతుందో ఊహించుకోవచ్చు.

3. ప్రవక్తల మరణం

ప్రభువు సీనాయికొండ దగ్గర యిప్రాయేలీయులతో చేసికొనిన నిబంధనాన్ని గూర్చి ప్రవక్తలు తేపతేపకు ప్రజలను హెచ్చరిస్తూండేవాళ్ల మోషే ధర్మశాస్తాన్నిపాటించమని జనులను మందలిస్తూండేవాళ్లు, కాని ఈ ధర్మశాస్తాన్ని విూరేవాళ్లల్లో మొట్టమొదటి వాళ్లు రాజులూ అధికారులూను. కనుక ప్రవక్తలు ఈ పెద్దమనుషులను చీవాట్లు పెడుతూండేవాళ్ళ వాళ్ళ అధికార గర్వంతో ప్రవక్తలను హింసించేవాళ్ళు అహాబురాజు ప్రవక్తలను పట్టి చంపించాడు - 1రాజు 18,4, అలాగే యోయాకిం రాజుకూడ చంపించాడు - యిర్మీ 26,20-23. యిప్రాయేలీయులు ఓ సింహం లాగ ప్రవక్తల విూదబడి వాళ్ళను వధించారు - 2,30, ఈ సందర్భాలను పరస్కరించుకొనే నూత్న వేదంలో క్రీస్తు "యెరూషలేమూ! నీవు ప్రవక్తలను చంపేదానివి" అన్నాడు — మత్త23,37.

ఈలా ప్రాణాలు కోల్పోయిన ప్రవక్తలందరిలోను బాధామయ సేవకుడు ఘనుడు. ఇతన్ని ఓ గొర్రెపిల్లను లాగ వధ్యస్థానానికి నడిపించుకొనిపోయారు. ఐనా ఆ మహానుభావుడు పల్లెత్తు మాట అనలేదు. మన పాపాల కోసం అతన్ని వధించారు - యెష53,7-8. పుణ్య పురుషుడు తన్ను సంహరించే పాపల కోసం ప్రార్ధన చేస్తూ తనువు చాలించాడు. అతని మరణం ద్వారా మనకు రక్షణం చేకూరింది – 58,11. పూర్వవేదంలోని ఈ బాధామయ సేవకుడు నూత్న వేదంలో రాబోయే క్రీస్తుని సూచిస్తాడు.

ప్రభువు సందేశాన్ని విన్పించడంలో ప్రవక్తలు నానా హింసలు అనుభవించారని చెప్పాం ఈ యధ్యాయంలో నిజమైన వేదబోధకులు ఈ బాధలను నేడూ ఏదోవొకరూపంలో అనుభవిస్తూనే వున్నారు.

6, ప్రవచనం - నాడూ నేడూ

1. నాడు

పూర్వవేదంలో ప్రవక్తలు దైవ సందేశాన్ని విన్పించి ప్రజలకు చైతన్యం కలిగించారు. రాజులతో పాటు, యాజకులతో పాటు, ప్రవక్తలు కూడ యిస్రాయేలు సమాజానికి ఎనలేని సేవలు చేసారు. మోషే యిప్రాయేలు ప్రజలంతా కూడ ప్రవక్తలై