పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇక్కడ యిూ విూకాయా చిత్తశుద్ధి యెంత గొప్పదో ఆలోచించండి. అతడు తోడి ప్రవక్తలను నాలు వందల మందినీ రాజునూ గూడ ఎదిరించి నిలచాడు. బాధలకు గురయ్యాడు, ఐనా ప్రభువు పేరుమిూదిగా సత్యం చెప్పడానికి మాత్రం వెనుకాడలేదు.

2. ప్రజలు ప్రవక్తల బోధలు వినలేదు

ప్రవక్తలు అనుభవించిన ఓ తీవ్రబాధ, ప్రజలు వాళ్ల బోధలు వినకపోవడం, యెషయా ప్రవచనారంభంలో ప్రభువు ఈలా అన్నాడు :

"భూమ్యాకాశాలూ వినండి!
నేను పెంచిన బిడ్డలే నామిూద తిరగబడ్డారు
ఎద్దుకు తన యజమానుడెవరో తెలుసు
గాడిదకు తన యజమానుని దొడ్డి తెలుసు
కాని యిప్రాయేలుకు మాత్రం ఏమిూ తెలియదు” - 1,2-3.


ఈలాదేపట్టే లక్ష్యపెట్టని ప్రజలు ప్రవక్తలను లక్ష్యపెడతారా? కనుకనే ప్రభువు యెషయాతో "వాళ్ల చెవులు ప్రవక్తల బోధలు విన్నట్లే వుంటాయి కాని వాళ్లు ఏవిూ అర్థం చేసికోరు. వాళ్ల కండ్లు చూచినట్లే వుంటాయి కాని వాళ్లు ఏమిరా గ్రహించలేరు. నీవు వాళ్లు ఏమి అర్థం చేసికోకుండా వుండేలా చేయి. వాళ్ల చెవులు వినకుండ వుండేలా, కండ్ల చూడకుండ వుండేలా చేయి. ఇక వాళ్లు అర్థం చేసికోలేరు, వినలేరు, చూడలేరు. లేకుంటే వాళ్లు నావద్దకు వచ్చి తమ రోగాన్ని నయం జేయించుకొనే వాళ్లేకదా!" అన్నాడు - యెష 6,9–10. ఆ ప్రభువు అన్నంతా జరిగింది. ప్రజలు యెషయా బోధ వినలేదు, అతని మాటలను అర్థం చేసికోలేదు. అది అతనికి యెంతో బాధ కలిగించింది.

ప్రభువు యిర్మీయాతో ఈలా అన్నాడు. "నీవు ఈ సంగతులను ప్రజలతో చెస్తావు గాని వాళ్లు నీమాట వినరు. నీవు వాళ్లను పిలుస్తావు గాని వాళ్ళ నీకు జవాబీయరు" - ಯಲ್ಲಿ 7,27.

యెహెజేలుతో ప్రభువు ఈలా నుడివాడు. "నరపత్రుడా! నేను నిన్నుయిస్రాయేలు ప్రజ వద్దకు పంపుతున్నాను. వాళల్లా వాళ్ల పూర్వులూ నామిూద తిరగబడ్డారు, ఇoకా తిరగబడుతూనే వున్నారు. వాళ్లు నన్ను గౌరవింపని మొండి మనుష్యులు, కాని ప్రభువునైన నా సందేశం విన్పింపమని నేను నిన్నువాళ్లచెంతకు పంపుతున్నాను. ఆ తిరుగుబాటుదారులు నీమాటలు ఆలించినా ఆలించకపోయినా కనీసం తమ నడుమ ఓ ప్రవక్త ఉన్నాడనైనా గుర్తిస్తారు" - 2,3-5. "వాళు విన్నా వినకపోయినా నేను చెప్పిన మాటలన్నీ నీవు వాళ్లతో చెప్ప. వాళ్ల వట్టి తిరుగుబాటు మూక" -2.7. "నేను నీతో చెప్పిన సంగతులు నీవు వాళ్లతో చెప్ప, వారిలో కొందరు నీమాటలు ఆలిస్తారు గాని కొందరు ఆలించరు. వాళ్ల వట్టి తిరుగుబాటు మూక" - 3,27.