పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఎవరి వద్దనుండి వడ్డీకి సొమ్మ పుచ్చుకోలేదు
ఐనా ప్రతివాడూ నన్ను శపించేవాడే - 15, 10

ప్రభూ! ఆనాడు నీవు నాతో సంభాషించగా
నీ పలుకు నేను ఆతురతతో విన్నాను
నేను నీ దాసుడ్డి కనుక నీ వాక్కు
నా హృదయానికి అమితానందం కలిగించింది
నేను భోగప్రియలతో కలసి
సంతోషంగా కాలం వెళ్లబుచ్చలేదు
నీయాజ్ఞకు బదుడనై ఒంటరిగా వుండిపోయాను
నీవు నన్ను కోపగ్రస్తుణ్ణి చేసావు
నేనీలా బాధలతో వ్రుగ్గిపోతూండవలసిందేనా?
ఈ గాయమిక యెప్పటికి మానదా?
వేసవిలో మెండిపోయే యేటిలాగా
నీవు నన్ను నిరుత్సాహపరచ దలచుకొన్నావా? - 15, 16-18.

ఈలాంటి వాక్యాలు పల్కిన ప్రవక్త ఏలాంటి శ్రమలు అనుభవించి వుంటాడో ఊహించుకోండి. అందుకే పూర్వవ్యాఖ్యాతలు యిర్మీయా బాధల్ని క్రీస్తు శ్రమలతో పోల్చారు.

ప్రవక్తలు చాల చిత్తశుద్ధి కలవాళ్లు అహాబురాజు గిలాదులోని రామోతు విూదికి యుద్దానికి వెళ్లగోరి ప్రవక్తలను సంప్రతించాడు. అతని ఉప్ప తిని బ్రతికే నాలువందల మంది ప్రవక్తలూ, వారి నాయకుడు సిద్మియా, రాజుకే విజయం కలుగుతుందని ఇచ్చకాలు పలికారు. కాని చిత్తశుద్ధి కల విూకాయా మాత్రం అహాబుకి ఓటమి కలుగుతుందని ప్రవచించాడు. దానితో సిద్మియా రెచ్చిపోయి విూకాయాను నిండు కొలువులో చెంపలు వాయించి "బాబూ! దేవుని ఆత్మ నన్ను వదలిపెట్టి నీ చెంతకు వచ్చి నీతో ప్రవచనం చెప్పించిందా? అదెప్పటినుండి?" అని హేళనం చేసాడు. మిూకాయా "నీవు యుద్ధం వచ్చినపుడు పారిపోయి మూలగదిలో దాగుకొంటావు. దేవుని ఆత్మ ఎప్పటినుండి నాతో ప్రవచనం చెప్పిస్తూందో అప్పడే నీకు తెలుస్తుంది పో" అన్నాడు. రాజుకు విూకాయా అంటే అసలే గిట్టదు. కనుక అతడు ఆ ప్రవక్త విూద మండిపడి అతన్నిచెరలో త్రోయించాడు. నేను యుద్ధం నుండి సురక్షితంగా తిరిగి వచ్చిందాకా ఇతనికి రొట్టె నీళ్ల తప్పితే మరేమి ఈయవద్దని సేవకులకు కట్టడ చేసాడు. కాని విూకాయా "నీవసలు పోరునుండి తిరిగిరావు, అలా వచ్చావో, ప్రభువు నా ద్వారా ప్రవచనం చెప్పించలేదనుకో" అన్నాడు. విూకాయా చెప్పినట్లే రాజు రామోతు యుద్ధంలో గతించాడు - 1రాజులు 22, 24-28,