పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/262

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

8. తిరిగి మనం ప్రభువు దగ్గరికి వెళ్లాం
అతడు మనలను కొట్టాడు, కాని మనకు చికిత్స చేస్తాడు
మనలను గాయపరిచాడు, కాని మన గాయాలకు కట్టుకడతాడు
 - హోపేయ 6,1
8A ప్రభువు ఈలా అంటున్నాడు
యిప్రాయేలు బాలుడై యుండగా నేనతన్ని ప్రేమించాను
ఐగుపునుండి నా కుమారుని పిల్చాను
కాని నేనతన్ని పిల్చినకొలది
అతడు నానుండి వైదొలగాడు
నా ప్రజలు బాలుదేవతకు బలు లర్పించారు
విగ్రహాలకు సాంబ్రాణిపాగ వేసారు
యిస్రాయేలుకి నడవడం నేర్పింది నేనే
నేను వాళ్ళను నా చేతుల్లోకి తీసుకొన్నాను
ఐనా నేను తమ్మ కరుణించానని వాళ్ళ గ్రహించలేదు
గాఢమైన ప్రేమానురాగాలతో
నేను వాళ్ళను నా చెంతకు రాబట్టుకొన్నాను
వాళ్ళను పైకెత్తి నా బుగ్గల కానించుకొన్నాను
క్రిందికి వంగి వాళ్ళచే అన్నం తినిపించాను
ఐనా వాళ్ళ నా వద్దకు రావడానికి అంగీకరింపలేదు — హోషే 11, 1-5
8B. యిప్రాయేలూ! నేను నిన్నెట్లు విసర్జించగలను!
నిన్నెట్లు పరిత్యజించగలను?
నేను నిన్ను ఆద్మావలె, సెబోయిూమువలె, నాశం చేయగలనా?
నా హృదయం అందులకు అంగీకరించడంలేదు
నా యెడద జాలితో కంపిస్తూంది
నేను కోపంతో మిమ్మ శిక్షింపను
యిప్రాయేలును మరల నాశం చేయును
నేను దేవుణ్ణిగాని నరుణ్ణి కాదు నేను మీమధ్య వున్న పవిత్రమూర్తిని
నేను మీ చెంతకు కోపంతో రాను - హోపే 11, 8-9