పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అతన్ని ఎదిరించారు, ప్రజలు అతన్ని చూచి నవ్వారు. కపట ప్రవక్తలు అతడు చెప్పిందానికి వ్యతిరేకంగా ప్రవచనం చెప్పారు. అందరూ యిర్మీయాను హేళన చేసారు. ఆ బాధల్లో అతడు ఈలా విలపించాడు :

ప్రభో! నీవు నన్ను వంచించావు
నీవు నాకంటె బలవంతుడివి కనుక
నా మిూదబడి నన్ను గెల్చావు
అందరూ నన్ను ఎగతాళి చేసేవాళ్ళే
జనమంతా నన్ను గేలిచేసేవాళ్ళే
నీ సందేశాన్ని విన్పించినందుకు
రోజంతా నేను నవ్వల పాలౌతున్నాను
నేను ప్రభువు పేరెత్తను
అతని పేరు విూదిగా ఇక బోధ చేయను
అనుకొన్నాను గాని, నీ సందేశం మాత్రం
నా హృదయంలో ఓ మంటలా మండుతూంది
నేను దాన్ని లోలోపల అణచిపెట్టుకోలేక
విసిగి వేసారిపోతున్నాను
ఆ సందేశం నా హృదయాంతరాళంలో నుండి
ఉబికివబికి వెలుపలికి వసూంది. - 20, 7-9.
నేను పట్టిన రోజు శాపగ్రస్తం కావాలి
మా యమ్మ నన్నుకన్నదినం
అశుభదినంగా పరిగణింపబడాలి
నీకో మగకందు పట్టాడని
కబురుతెచ్చి నా తండ్రిని సంతోషపెట్టిన
వారావహుడు శాపగ్రస్తుడు కావాలి. 20, 14-15

నేను ఈ దేశంలో ప్రతివాడితోను
జగడమాడవలసి వచ్చింది
నేనెంత దౌర్భాగ్యణ్ణి!
తల్లీ! అసలు నీవు నన్నెందుకు కన్నావమ్మా!
నేనెవరికీ వడ్డీకి అప్పీయలేదు