పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/256

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

23. యువకులు అలసిపోవచ్చు, సామ్మసిల్లి పడిపోవచ్చు
కాని ప్రభువుని నమ్మినవాళ్ళు నూత్నబలాన్ని పొందుతారు
వాళ్లు పక్షిరాజులా రెక్కలువిప్పి పైకెగురుతారు
వాళ్ళ పరుగెత్తుతూ గూడ అలసిపోరు
నడుస్తూగూడ సొమ్మసిల్లి పడిపోరు - యెష 40, 30 -31
24. ప్రభువు వాక్మిది
నన్ను విడనాడి నరుజ్జీ నమ్మేవాడు,
మనుష్యమాత్రునిమీద ఆధారపడేవాడు,
శాపగ్రస్తుడు
కాని నన్ను నమ్మేవాడు నా దీవెనలు పొందుతాడు -యిర్మీ 17, 5-7
24A. అంజూరం పూత పట్టకపోయినా
ద్రాక్షతీగ కాయలు కాయకపోయినా
ఓలివ పంట నాశమైనా
పొలం పండకపోయినా
గొర్రెల గుంపులన్ని చచ్చినా
కొట్టంలోని పసులు నాశమైనా
నేను ప్రభువునందు ఆనందిస్తాను
నా రక్షకుడైన దేవునియందు సంతసిస్తాను - హబి 3, 17-18
25 ప్రభువునైన నేను మారిపోయేవాణ్ణి కాదు - మలాకీ 3,6
26 మోషే, దేవునితో ఫరోరాజు దగ్గరికి వెళ్ళడానికిగాని, యిప్రాయేలీయులను ఐగుప్తనుండి తీసికొనిరావడానికిగాని, నేనేపాటివాణ్ణి అన్నాడు. దేవుడు అతనితో నేను నీకు తోడైయుంటాను అని చెప్పాడు - నిర్గ 3, 11-12
27 మీ భారాన్ని ప్రభువు మీద మోపండి
అతడు మిమ్మ ఆదుకొంటాడు - కీర్త 55, 22
 - మీ చింతలన్నీ ప్రభువుకే వదలివేయండి
అతడు మిమ్ముగూర్చి జాగ్రత్త పడతాడు - 1షేత్రు 5,7
28 దేవుడు తన్ను ప్రేమించేవాళ్ళకు అన్నీ అనుకూలంగానే జరిగి పోయేలా చేస్తాడు - రోమా 8,28
29 నేను సీలా, తిమోతి మీకు బోధించిన దైవపత్రుడైన క్రీస్తు "ఔను" అనేవాడూ “కాదు" అనేవాడూ కాదు. అతడు దేవుని "ఔను" అని చెప్పాలి. దేవుని వాగ్దానాలన్నిటికీగూడ అతడు "ఔను" అనే సమాధానం అనాలి - 2 కొరి 1, 19-20