పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/254

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రభువే అతనికి దేవుడు. అతడు నరులనుగాక దేవుణ్ణి నమ్మకొని బ్రతికేవాడు. అంచేత పాలుత్రాగి తల్లి రొమ్ముమీద పండుకొన్న పసిబిడ్డలాగ అతని హృదయం నిమ్మళంగా వుండిపోతుంది. అతడు తన ఆత్మను ప్రభువు చేతుల్లో పెట్టి ప్రశాంతంగా ఉండిపోతాడు.

  • 1.నేను పండుకొని నిద్రపోయాను

మళ్ళా సురక్షితంగా లేచాను

ప్రభువే నన్ను కాపాడాడు - కీర్త 3,5

  • 2.నాకు పండుకోగానే హాయిగా నిద్రపడుతుంది

ప్రభూ! నా రక్షణభారం వహించేవాడివి నీవే - 48

  • 3. ప్రభువు నాకు శైలము, కోట, రక్షణము

ప్రభువు నేను తలదాచుకునే దుర్గము

ప్రభువు నాకు డాలు, మహాశ్రయం - 18,2

  • 4.సైన్యాలు నామీదికి దండెత్తివచ్చినా

నా హృదయం భయపడదు - 27,3

  • 5.రాజునకు మహాసైన్యం వలననే విజయం కలగదు

సైనికునికి మహాబలం వలననే రక్షణం కలగదు - 33,16

  • 6.కొందరు రథాలనూ గుర్రాలనూ నమ్మకొంటారు

మేమైతే ప్రభుని నమ్మకొంటాం – 20,7

  • 7.ప్రభువు నాకు దీపం వెలిగిస్తాడు

నా త్రోవలోని చీకటిని తొలగిస్తాడు - 18,28

  • 8.ప్రభువు నాకు దీపమూ, రక్షణమూ

ఇక నేనెవరికి భయపడాలి? - 27.1

  • 9.ప్రభువే నాకు కాపరి, యిక యే కొదవా లేదు – 23, 1
  • 10.నేను చీకటి లోయగుండా పయనించినా ఏ యపాయానికీ జంకను

నీవు నాకు తోడైయుంటావు

నీచేతి కోలా, నీ బడితా నన్ను కాపాడుతూంటాయి - 23, 4

  • 11.పుట్టినప్పటి నుండి నన్ను నీ రక్షణంలోనే వుంచారు

మా తల్లికి జన్మించినప్పటినుండి నీవే నాకు దేవుడవు - 22,10

  • 12.నేను ప్రభు మందిరం దగ్గర పెరిగే ఓలివ చెట్టులా పున్నాను

ఆ ప్రభువు ఆదరాన్ని నమ్మకొని బ్రతుకుతున్నాను - 52.8