పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/253

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

15.ప్రభువు పరిశుద్ధమందిరంలో వసిస్తూంటాడు
విధవలనూ అనాథబాలలనూ సంరక్షిస్తూంటాడు - కీర్తన 68,6

16.పాపి చనిపోవడంవల్ల నాకేమీ సంతృప్తికలుగదు. అతడు పాపంనుండి వైదొలగి మళ్ళా జీవించడంవల్ల నాకు సంతోషం కలుగుతుంది - యెహె 33,11.

17.భూమికి ఆకాశం ఎంత యెత్తుగా ఉంటుందో
ప్రభువుకి భయపడేవాళ్ళపట్ల
ఆయన ప్రేమ అంత మిక్కుటంగా వుంటుంది - కీర్త 103, 11

18.ప్రభూ! నీవు మా తండ్రివి. మేము మట్టిముద్దలాంటివాళ్ళం. నీవు కుమ్మరివి. నీవే మమ్ము చేసావు - యెష 64,8

19.మనం పాపులమైయుండగా క్రీస్తు మనకొరకు చనిపోయాడు అంటే దేవునికి మనపట్ల ప్రేమవుందని అనుకోవాలి - రోమా 5,8

20.దేవుడు ప్రేమస్వరూపుడు - 1 యోహా 4,8

21.దేవుడు లోకాన్ని యెంతో ప్రేమించి తన యేకైక కుమారుణ్ణి ప్రసాదించాడు. ఆ కుమారుణ్ణి విశ్వసించే ప్రతివాడు నాశం చెందక నిత్యజీవం పొందడానికే దేవుడు అలాచేసాడు -యోహా 3,16

22.తన స్నేహితుల కొరకు ప్రాణాన్ని ధారబోసేవాడికంటె ఎక్కువ ప్రేమకలవాడెవడును లేడు - యోహా 15,13 23.ఇకమీదట నేను మిమ్ము దాసులని పిలవక స్నేహితులని పిలుస్తాను - యోహా 15, 15

24.నన్ను ప్రేమించి నాకొరకు ప్రాణత్యాగం చేసికొనిన దేవుని పుత్రునియందలి విశ్వాసముచేతనే ఇప్పడు నేను ఈ శారీరక జీవితం గడుపుతున్నాను - గల 2, 20

25.మనకు అనుగ్రహింపబడిన ఆత్మద్వారా దేవుని ప్రేమ మన హృదయాల్లోకి కుమ్మరింపబడింది - రోమా 5,5.

15. ప్రభువు విశ్వసనీయుడు

బైబులు భక్తులకు భగవంతునిమీద అచంచలమైన విశ్వాసం. భక్తుడు తాను నిద్రనుండి మేల్కొనడంగూడ భగవంతుడు చేసిన ఉపకారమేనని భావిస్తాడు. ప్రభువు అతనికి కోటా, దుర్గమూ, రక్షణమూను. శత్రుసైన్యాలు దండెత్తివచ్చినా అతడు భయపడడు. అతడు రథాలు గుర్రాలు మొదలైన అంగబలాన్ని కాక, దైవబలాన్ని నమ్మేపాడు. ప్రభువు అతని యెదుట దీపం వెలిగిస్తాడు. చీకట్ల తొలగిస్తాడు. అతడు తన భక్తుణ్ణి ఓ కాపరిలా ఆదరిస్తాడు. పచ్చిక పట్టుల్లో మేపుతాడు. చీకటి లోయలో పయనిస్తున్నపుడుకూడ తన చేతికోలతో అతన్నికాపాడుతూంటాడు. భక్తుడు మాతృగర్భంనుండి బయటపడినప్పటినుండి