పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/252

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

9.తల్లి తన ప్రేవున బుట్టిన బిడ్డను మరచిపోతుందా? తన శిశువును ప్రేమించకుండా వుంటుందా? ఒకవేళ తల్లి తాను కనిన బిడ్డను మరచిపోతే పోతుందేమోకాని, నేను మాత్రం మిమ్ము మరచిపోను - యెష49, 15

9 ఎ. యెరూషలేమూ ! నేను నిన్నెన్నడూ మరువలేను
నీ పేరు నా యరచేతులమీద వ్రాసికొన్నాను - యెష49, 16

10.యిస్రాయేలు బాలుడైయుండగా నేనతన్ని ప్రేమించాను. ఐగుప్తునుండి నా కుమారుణ్ణి పిలిపించాను - హోషే 11,1

11.తండ్రి తన కుమారునిమీద కరుణ జూపినట్లే
ప్రభువు తనకు భయపడేవాళ్ళమీద జాలి చూపుతాడు - కీర్త 103, 16

12.మా అమ్మా నాన్నా నన్ను గెంటివేసినా
ప్రభువమాత్రం నన్ను చేరదీస్తాడు - కీర్త 27, 10

12ఎ నీ ప్రేమ ప్రాణంకంటె మెరుగైంది
కనుక నేను నిన్ను స్తుతిస్తాను - కీర్త 68, 3

13.నిన్ను సృజించిన ప్రభువే నీ భర్త. సర్వశక్తిమంతుడని ఆయనకు పేరు. భర్తవలన పరిత్యక్తయై దుఃఖాక్రాంతులైన పడుచు భార్యను ఆ భర్తలాగే ప్రభువుకూడ నిన్ను మళ్ళా చేపడతాడు. ప్రభువు నీతో ఈలా అంటున్నాడు. నేను ఒక్క క్షణకాలం నిన్ను విడనాడాను. కాని యిప్పడు గాడానురాగంతో నిన్ను మళ్ళా చేరదీసుకుంటాను. కోపావేశంతో ఒక్కనిమిషం నీనుండి నా ముఖం మరల్చుకొన్నాను. కాని యిప్పడు శాశ్వతమైన కృపతో నిన్నుకరుణిస్తాను. కొండలు కదిలితే కదలవచ్చుగాక, తిప్పలు తావుదప్పితే తప్పవచ్చుకాక, నా కరుణమాత్రం నిన్ను విడనాడదు - యెష54, 5–10

14.ప్రభువు పీడితులకు అనుకూలంగా తీర్పుజెప్తాడు
ఆకలిగొన్నవాళ్ళకు అన్నం పెడతాడు
బందీలను చెరనుండి విడిపిస్తాడు
గ్రుడ్డివాళ్ళకు చూపు దయచేస్తాడు
క్రిందపడినవాళ్ళను లేవనెత్తుతాడు
తన భక్తులను ప్రేమతో ఆదరిస్తాడు
మన దేశంలో నున్న పరదేసులను కాపాడతాడు
విధవలనూ అనాథబాలలనూ ఆదుకొంటాడు
దుర్మార్గుల పన్నాగాలనుమాత్రం నాశం చేస్తాడు - కీర్త 146-8-9