పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/251

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

1.ప్రభువు కయీనుని దేశదిమ్మరివి కమ్మని శపించాడు. అతడు ఆ శాపానికి భయపడి నాకెదురుపడినవాళ్ళు నన్ను చంపివేస్తారు గదా అని దేవునికి మొరపెట్టుకొన్నాడు. కయీనుకు ఎదురుపడినవాళ్ళు అతన్ని చంపకుండా వుండేలా ప్రభువు అతని నొసటిమీద ఓ గురుతుపెట్టాడు. ఆ రీతిగా ప్రభువు కయీనుని కరుణించాడు. - ఆది 4, 12-15.

2.నీవు మరియొకని అంగీని కుదువసామ్ముగా తీసికొంటే దాన్ని ప్రొద్దుక్రుంకకముందే అతనికి తిరగి యిచ్చివేయాలి. అతడు ఒంటిమీద కప్పకొనే నిలువుటంగీ అదే. అతడేమి కప్పకొని పండుకొంటాడు? నేను దయామయుడనైన దేవుణ్ణి గనుక ఆ పేదవాడు నాకు మొరపెట్టుకొంటే నేనతని గోడు వింటాను - నిర్గ 22, 26.

3.ప్రభువు మోషే ముందుగా సాగిపోతూ ఈలా ప్రకటించాడు. "ప్రభువు! ప్రభువు! అతడు కరుణామయుడు దయాపరుడైన దేవుడు. సులభంగా కోపపడేవాడు కాదు. నిత్యమూ ప్రేమ చూపేవాడు. నమ్మదగినవాడు. వేలకొలది ప్రజలను కృపతో జూచేవాడు. మన దోషాలనూ అపరాధాలనూ పాపాలనూ మన్నించేవాడు" - నిర్గ 34, 6-7.

4.ప్రభో! నీవు కరుణామయుడవూ ప్రేమపూరితుడవూ అని నే నెరుగుదును. నీ వెప్పడూ సహనంతోను దయతోను మెలుగుతూంటావు. నరులమీద కోపపడకుండా వండాలనీ, వాళ్ళను శిక్షించకుండా వుండాలనీ, నీ వెప్పడూ కోరుకొంటావు. - యోనా 42

5.ప్రాణులన్నీ ఆశతో నీవైపు చూస్తూంటాయి
వాటికి ఆకలైనప్పడు నీవు ఆహారం పెడతావు
నీవు ప్రాణులకు అవసరమైనంతగా తిండి పెట్టి
వాటి అక్కర తీరుస్తుంటావు - కీర్త 145, 15-16

6.ఇతరజాతులకంటె మీదేమో పెద్దజాతి అని ప్రభువు మిమ్ము ఎన్నుకోలేదు. ప్రపంచములోని జాతులన్నిటికంటె మీది చాల చిన్నజాతి. కాని ప్రభువు మిమ్ము అధికంగా ప్రేమించాడు కనుక, మీ పితరులతో తాను చేసిన ప్రమాణాన్ని నెలబెట్టుకోగోరాడు గనుక, మిమ్మే ఎన్నుకొన్నాడు - ద్వితీ 7,7-8

7.గరుడపక్షి తనపిల్లలను రెక్కలమీద మోసికొనిపోయినట్లే నేనూ మిమ్ముఐగుప్తునుండి మోసికొనివచ్చి నా కడకు చేర్చుకొన్నాను - నిర్ణ 19,4

8.నేను మిమ్మ శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాను. కనుక ఇప్పుడు మిమ్ము కరుణతో ఆదరిస్తాను - యిర్మీ 31.3