పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/247

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

10.నిత్యుడవైన ప్రభూ! నీవు రహస్యాలను గుర్తుపట్టేవాడివి
 పనులు జరగకముందే వాటినిగూర్చి తెలుసుకొనేవాడివి - దాని 13,42
11. ప్రభో! నీవు నరులు చేసే పనులన్నీ గమనిస్తూనే వుంటావు
ఎవరి కార్యాలకు తగినట్లుగా వాళ్ళను బహూకరిస్తూంటావు -యిర్మీ 32, 19
12. మా దేవుడు మోక్షంలో వున్నాడు
 ఆయన తన కిష్టమొచ్చిన కార్యాలన్నీ చేస్తాడు
 నరులు వెండి బింగారాలతో విగ్రహాలను చేసారు
 మానవమాత్రులే వాటిని మలుస్తారు
 కావననే అవి నోళ్ళన్నా మాట్లాడలేవు
కండ్లున్నా చూడలేవు
చెవులున్నా వినలేవు - 15, 2-6
13. ప్రభువు కంటబడకుండా దాగి ఉండేదేదీ లేదు - హెబై 4, 13.

12. ప్రభువు సర్వాంతర్యామి


                  ప్రభువు అంతటా వుండేవాడు. అతడు ప్రాణికోటిలో వుంటాడు అనడంకంటె
ప్రాణికోటే అతనిలో వుంటుంది అనడం సబబు. పక్షి ఆకాశంలో లాగ, తమరాకు వీళ్ళల్లోలాగ, మనమూ నిత్యం ఆ ప్రభువులో మునిగి తేలుతూంటాం. ఐనా చిత్రమేమిటంటే, మనం ఆ ప్రభువులో ఉన్నా అతన్ని గమనించనే గమనించం. కంటికి కన్పించే సృష్టి వస్తువులు మన హృదయాన్ని బలంగా ఆకర్షించి కంటికి కన్పించని ఆ సృష్టికర్తను పూర్తిగా విస్మరించేలా చేస్తాయి. ఐనా నరుడు ఆలోచనతో జీవించేవాడు. ప్రాణాత్మకుడైన ఆ ప్రభువు ప్రాణం పోస్తూండబట్టే అల్పప్రాణులమైన మనం ఇప్పటిదాకా ప్రాణాలతో బ్రతికి ఉన్నామని గుర్తించగలడు. ఈ సత్యాన్ని గుర్తించి దేవునికి కృతజ్ఞలమై యుండాలి. సజీవుడైన ఆ ప్రభువుని నిత్యం స్మరించుకొంటూండాలి,

1.ఏ నరుడూ నా కంటబడకుండా రహస్యంగా దాగుకోలేదు. నేను భూమ్యాకాశాల యందంతటా నెలకొని ఉండేవాణ్ణి - యిర్మీ 23,24 ۔
2. ప్రభువు ఎక్కడ ఏమిజరిగేదీ గమనిస్తూనే ఉంటాడు. మనం మంచి జేసినా చెడ్డజేసినా అతడు పరికిస్తూనే ఉంటాడు - సామె, 15,3
3. ప్రభువు నరులుచేసే పనులన్నీ గుర్తిస్తూనే వుంటాడు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా
 ఏమిచేసినా అతడు ఒక కంట కనిపెడుతూనే వుంటాడు - సామె 5, 21
4. ప్రభువు కండ్లు సూర్యునికంటె పదివేలరెట్ల కాంతిమంతంగా వుంటాయి. అవి నరులుచేసే పనులన్నీ పరికిస్తూ వుంటాయి. రహస్య కార్యాలను గూడ గుర్తిస్తూనే వుంటాయి - సీరా 23, 19
240