పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/243

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

11.నీవు బలులవలన సంతుష్టిచెందవు
నేను దహనబలి నర్పిస్తే నీవు ప్రీతిజెందవు
దేవా! నేనర్పించే బలి పశ్చాత్తాపపూరితమైన హృదయమే
పశ్చాత్తాప పూరితము వినయాన్వితము ఐన హృదయాన్ని
నీ వనాదరం చేయవు = 51, 17

12.ప్రభువు మీకూ, మీ సంతానానికీ విధేయాత్మకమైన హృదయాలను దయచేస్తాడు - ద్వితీ 30,6 13.ఆ కాలంలో నేను యిప్రాయేలీయులతో జేసికొనే నూత్న నిబంధనం ఇది. నేను నా ధర్మశాస్రాన్ని వాళ్ళ అంతరంగంలో వుంచుతాను. నా విధులను వాళ్ళ హృదయాలమీద వ్రాస్తాను. నేను వాళ్ళ దేవజ్ఞవుతాను, వాళ్ళ నా ప్రజలౌతారు - యిర్మీ 31, 33 14.నేను వాళ్ళకు ఏకైక దృష్టిగల హృదయాన్ని ప్రసాదిస్తాను. అందువలన వాళ్ళ నన్ను శాశ్వతంగా పూజిస్తారు. వాళ్ళూ వాళ్ళ తర్వాత వచ్చేవాళ్ళ సంతతీకూడ బాగుపడిపోతారు - యిర్మీ 22, 33 15.నేను మీకు నూత్న హృదయాన్నీ నూత్న మనస్సునీ దయచేస్తాను. మీలోని రాతిగుండెను తీసివేసి దాని స్థానే మాంసపు గుండెను నెలకొల్పుతాను. నా యాత్మను మీ మీదికి పంపుతాను. మీరు నా యాజ్ఞలను పాటించేలా, నా శాసనాల ప్రకారం జీవించేలా చేస్తాను - యెహెజ్కేలు 36, 26-27 16.హృదయంలోనుండి దురాలొచనలు పుట్టకవస్తాయి. వీటివలన నరహత్యలు వ్యభిచారాలు అశుద్ధ కార్యాలు వంగతనాల కూట సాక్ష్యాలు దూషణలుకలుగుతాయి. నరుని మాలిన్యపరచేది యివే కాని చేతులు కడుగుకోకుండ భుజించడంలాంటి బాహ్యశుద్ధిలేని క్రియలు కాదు — మత్త 15, 19 17.విశుద్ధ హృదయులు దేవుణ్ణి దర్శిస్తారు - మత్త 5,8 18.నేను సాధుశీలుడ్డి, వినమ హృదయుడ్డి మీరు నా నుండి నేర్చుకొనండి — మత్త 11,29 19.సైనికుల్లో వొకడు అతని ప్రక్కను బల్లెంతో పొడిచాడు. వెంటనే రక్తమూ నీరూ సవించాయి - యోహా 19,34 20.ఆత్మశుద్ధిలేని యాచార మదియేల భాండశుద్ధి లేని పాకమేల చిత్తశుద్ధిలేని శివపూజలేలయా?