పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/237

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

  మహోన్నతుడు దుర్మార్గుల బలివలన సంతుష్టి చెందడు
  పెక్కు బలులు అర్పించడం వలన వారి పాపాలు తొలగిపోవు
  పేదవాని పశువుని అపహరించి బలిగా అర్పించడం
  తండ్రి చూస్తుండగా కుమారుణ్ణి చంపడంలాంటిది
  పేదలకు అన్నమే ప్రాణం
  ఆ యన్నాన్ని నాశం చేయడమనగా పేదవాణ్ణి చంపడమే
  పేదవాడి జీవనోపాధిని చెరచేవాడు వాణ్ణి చంపినట్లే
  కూలివాడి కూలి ఎగగొట్టేవాడు వాణ్ణి హత్య చేసినట్లే - సీరా 34, 18–22
<poem>4. మీ యొడలు కడుగుకొని శుద్ధిచేసికొనండి
  ఇక నా యెదటు దుష్కార్యాలు చేయకండి
 మీ పాపపు పనులనుండి వైదొలగి
    సత్కార్యాలకు పూనుకొనండి
    న్యాయాన్ని పాటించండి, పీడితులకు మేలు చేయండి
    అనాథుల హక్కులు నిలబెట్టండి
    వితంతువులను ఆదుకొనండి — యెష 1, 16-17

5. దరిద్రులను పీడించే బంధాలను సడలిస్తే
    వాళ్ళ మెడమీది అన్యాయపు కాడిని తొలగిస్తే
    వాళ్ళకు స్వాతంత్ర్యం ప్రసాదిస్తే
    అదే నాకు నచ్చిన ఉపవాసం,
    మీ భోజనాన్ని పేదలకు గూడ వ
   దిక్కులేనివారికి మీ యింటిలో ఆశ్రయమిస్తే
    దీనులకు బట్ట్తలు కట్టబెడితే
   అక్కరలోవున్న తోడి జనాన్ని ఆదుకొంటే
   అదే నాకు నచ్చిన ఉపవాసం - యెషయా 58, 6-7

6. నీతి ఓ నదిలాగ పొంగి పారాలి
   న్యాయం ఓ జీవనదిలాగ ప్రవహించాలి — ఆమోసు 5,24

6.A.అందుకు ఆయన వారితో "ఈ నా సోదరులలో అత్యల్పడైన ఏ వొక్కనికి మీరు
    ఇవి చేసినపుడు అవి నాకు చేసితిరి అని వక్కాణించుచున్నాను" అని చెప్పను;
    అందుకు ఆయన "ఈ యత్యల్పులలో ఒకనికై నను మీరివి చేయనప్పడు నాకును
    చేయలేదని వక్కాణించుచున్నాను" అని వారితో చెప్పను. -మత్తయి 25, 40-45

</poem>