పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/230

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

5. సృష్టి, ప్రాణిసంరక్షణం

1)సృష్టి

కుమ్మరి మట్టితో కుండను జేస్తాడు. తల్లి బిడ్డను కంటుంది. కవి కావ్యం వ్రాస్తాడు. కాని ఇవేవి సృష్టికావు. మానవులు చేసేదల్లా ఒక వస్తువును మరొక వస్తువుగా మార్చడం అంతే కాని భగవంతుని సృష్టి ఈలాంటిది కాదు. ఆయన సర్వశూన్యం నుండి లోకాన్ని సృజించాడు. ఈ పని అతడొక్కడే చేయగలడు. ఈ సృష్టి అంతా ఓనాడు నాశమైపోతుంది. కాని సృష్టికర్త మాత్రం శాశ్వతంగా వుండిపోతాడు.

l.మీ రక్షకుడైన ప్రభువును నేనే
మిమ్మ సృజించినవాడను నేనే
ఆకాశాన్ని బట్టవలె విప్పినవాడను నేనే
ఎవరి తోడ్పాటు లేకుండానే నేను
భూమిని సృజించాను - యెష44,24

2.దేవుడు భూమ్యాకాశాలనూ వానిలో వుండే వస్తువులనూ
శూన్యం నుండే సృజించాడు - 2 మక్కబీ 7,28

3.ప్రభువు పలుకు పలుకగానే ప్రపంచసృష్టి జరిగింది
 ఆయన ఆజ్ఞ ఈయగానే సృష్టి ఏర్పడింది - కీర్త 88,9

4.ప్రభువు నరుడ్డి తనకు పోలికగా చేసాడు. ఆ నరుడ్డి స్త్రీ పురుషులనుగా చేసాడు - ఆది 1,27

5.నీవు చేసిన సృష్టికంతటికీ నరుడ్డి అధిపతిని చేసావు
 గొర్రెలు ఎడల్లో వన్యమృగాలు
 ఆకాశంలోని పక్షులూ సముద్రంలోని చేపలూ
 వీటికన్నిటికీ అతడే రాజు - కీర్త 8,6-9

6.ప్రభువు మహిమ కలకాలము నిల్చుగాక
ప్రభువు తాను చేసిన సృష్టిని జూచి ఆనందించుగాక - కీర్త 104,31

7.ప్రభువు కావించిన సృష్టి కార్యాలన్నీ మంచివే
అతడు సకాలంలో ప్రాణుల యక్కరలు తీరుస్తూంటాడు - సీరా 3,33

8.ఆకాశం ప్రభువ మహిమను చాటిచెపూంది
 ఆయన చేసిన సృష్టిని వెల్లడిచేస్తూంది - కీర్త 19,1