పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/226

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

30. సజీవమూ శాశ్వతమూ ఐన దేవుని వాక్కుద్వారా మీరు నూతన జన్మను పొందారు - 1షేత్రు 1,23. నేను మీతో చెప్పిన మాటల వలన మీరిప్పడు శుద్ధులయ్యారు - యోహా 15,3.

31. పవిత్రాత్ముడు వచ్చాక మీకు సమస్త విషయాలు బోధిస్తాడు. నేను చెప్పిన సంగతులన్నీ మీకు జ్ఞప్తికి తెస్తాడు - యోహా 14,26. అతడు మిమ్మ సర్వ సత్యంలోకి నడిపిస్తాడు. తనంతట తాను ఏమీ బోధించక తాను నావలన వినిన సంగతులనే మీకు బోధిస్తాడు. జరగబోయే విషయాలను మీకు తెలియజేస్తాడు - యోహా 16,13,

32. నీ బిడ్డలందరికీ ప్రభువే బోధిస్తాడు - యెష54, 13, యోహా6,45.

4. భగవంతుడూ నరుడూ, విజ్ఞానం

1) భగవంతుడూ నరుడూ

భగవంతునికీ నరునికీ వుండే సంబంధాన్ని కీర్తనలు నానారూపాల్లో వ్యక్తం చేస్తాయి, మూర్ఖడు దేవుడు లేడులే, అతడు మనం చేసే పని చూడడులే అనుకొంటూంటాడు, కాని ప్రభువు నరులను గమనిస్తూనే వుంటాడు. తన్నెవరైనా పూజిస్తున్నారా అని పరిశీలించి చూస్తూనేవుంటాడు. అతనికి వినయవంతులంటే మాలావప్రియం. గర్వాత్మలంటే పరమ అసహ్యం. నరులకు మంచి ఆలోచనలు పట్టించి వాళ్ళచేత సత్కార్యాలు చేయించేది ప్రభువే. అటుపిమ్మట వాళ్ళను బహూకరించేదీ ఆ ప్రభువే అతడు నరుడ్డి నిత్యం పరిశీలించి చూస్తూనే వుంటాడు. నరుడు అతని సన్నిధిలోనుండి పారిపోలేడు, పారిపోయి యొక్కడికి వెళ్ళగలడు?

నరుని తరపున నరుడు ఆ ప్రభువుని నమ్మాలి, దేవుణ్ణి ఓ తండ్రిలా భావించి అతని సన్నిధిలో నడవడం నేర్చుకోవాలి. అతనికి ప్రార్థన చేసికోవాలి, చేతు నమస్కరించాలి. నరుల సౌభాగ్యమంతా ఆ భగవంతుణ్ణి పూజించుకొనడంలోనే వుంది,

1. మూర్థులు దేవుడు లేడులే అనుకొంటూంటారు - కీర్త 58,1
2. మూర్థులు దేవుడు లేడులే అనుకొంటారు
వాళ్ళ వట్టి దుర్మార్డులు,
ఘాతుక కార్యాలు చేస్తూంటారు
నీతితో ప్రవర్తించేవాడు ఒక్కడూ లేడు - 14 1