పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/223

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

4 ప్రభువు ఈలా అంటున్నాడు
నన్ను విడనాడి నరుని నమ్మేవాడు,
నరమాత్రునిమీద ఆధారపడేవాడు, శాపగ్రస్తుడు
అతడు ఎడారిలో ఎదిగే తుప్పలాంటివాడు
అతని కేలాంటి మేలు కలుగదు
ఆ తుప్ప ఎండివున్న మరుభూమిలో,
ఏమీ పెరుగని చౌటి పర్రలో ఎదుగుతుంది
కాని నన్ను నమ్మినాపై ఆధారపడేవాణ్ణి నేను దీవిస్తాను
అతడు ఏటివొడ్డున ఎదుగుతూ
నీటి చెంతకు వ్రేళ్ళు జొన్పించే చెట్టలాంటివాడు
అది బెట్టకు భయపడదు
దాని యాకులు పచ్చగా వుంటాయి
వానలు కురవకున్నా దానికి చింతలేదు
అది యెల్లపుడు పండు కాస్తుంటుంది - యిర్మీ 17, 5-8
5 ప్రభువే నాకు హితోపదేశం చేస్తూంటాడు
రాత్రుల్లో గూడ అంతరాత్మ నన్ను హెచ్చరిస్తూంటుంది
కనుక నేను ప్రభువుని స్తుతిస్తూంటాను - కీర్త 16, 7
6 ప్రభూ! నీవు బోధించే నరుడు ధన్యుడు
నీవు ధర్మశాస్తాన్ని ఉపదేశించే జనుడు భాగ్యవంతుడు - 94,12
7 ప్రభూ! నీ పలుకులు నాకెంతో రుచిగా వున్నాయి
నీ మాటలు తేనెకంటె తీయగా వున్నాయి - 119 -103
8 నీ వాక్యం ఓ దీపం లాంటిది
నా త్రోవకు వెలుగు లాంటిది - 119, 105
9 నీవే నా దేవుడవు
నీ చిత్తాన్ని నేను ఎలా పాటించాలో తెలియజెప్ప
నీ యాత్మ నన్ను సరళ మార్గంలో నడిపిస్తూండు గాక - 143, 10
10 ప్రభూ! నా కండ్లను తెరువు
నేను నీ ధర్మశాస్త్రం బోధించే అద్భుత సత్యాలను తెలిసికొంటాను - 119, 18
11 ప్రభువు తన వాక్కును పంపగానే అది గబగబ పరుగెత్తుకొంటూ భూమిమీదికి వస్తుంది - 147,15