పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/222

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

36. చిన్నబిడ్డలారా! మీరు పాపం చేయకుండా వుండడానికి ఈ సంగతులు వ్రాస్తున్నాను. ఎవడైనా పాపం చేసినట్లయితే నీతిమంతుడైన యేసుక్రీస్తు అనే ఉత్తరవాది తండ్రి సమక్షంలో మనకున్నాడు. మన పాపాలకు శాంతిచేసేవా డతడే. ఒక్క మన పాపాలను మాత్రమే కాదు, మానవులందరి పాపాలకూ శాంతి చేసే దతడే - 1 యోహా 2, 1-2.

3. దైవవాక్కు

బైబులు ప్రజలకు భగవంతుని వాక్కులన్నా అతని కట్టడలన్నా మహా గౌరవం. ప్రభువు పలుకులు ఏడుసార్లు పుటంవేసిన వెండిలాంటివి. మేలిమి బంగారం లాంటివి. తేనెపట్టనుండి చిప్పిలే తేనె లాంటివి. కనుక భక్తుడు ప్రభువాక్కును రేయింబవళ్ళు మననంచేసికొంటాడు. అతడు నీటియొడ్డున ఎదిగే చెట్టులాగ మంచిపండ్లు ఫలిస్తాడు.

ప్రభువు వాక్కు భక్తుణ్ణి హెచ్చరిస్తూంటుంది. రాత్రుల్లోగూడ హితోపదేశం చేస్తుంటురది. భగవంతుడే ఓ ఉపాధ్యాయుడై భక్తునికి బోధిస్తుంటాడు. ప్రభువాక్యం ఓ దీపంలా వెలుగుతూ త్రోవ జూపుతూంటుంది. ఆ ప్రభువు చిత్తాన్ని పాటించడమే నరుని ధ్యేయం. ప్రభువు అనుగ్రహంవలన నరుడు ఆయన ధర్మశాస్త్రంలోని అద్భుత పత్యాలను గ్రహిస్తాడు. రాత్రి నాల్లజాములూ ప్రభువనీ, అతని వాక్కునీ మననం చేసుకొంటాడు. ప్రభువు ఆజ్ఞలను పాటించడమంటే అతనికి పరమానందం.

1. ప్రభువు వాగ్హానాలు నమ్మదగినవి
అవి కొలిమిలో ఏడుసార్లు పటం వేసిన వెండివలె శ్రేష్టమైనవి - కీర్త 12,6
2 ప్రభువు ఆజ్ఞలు మేలిమి బంగారంకంటె మేలైనవి
తేనెపట్టనుండి చిప్పిలే తేనెకంటె తీయనైనవి
ప్రభూ! నీ యాజ్ఞలు ఈ దాసుణ్ణి హెచ్చరిస్తుంటాయి
వాటిని పాటిచడంవల్ల నాకు బహుమానంకూడ లభిస్తుంది - 19, 10-11
3. ప్రభువు కట్టడలను రేయింబవళ్ళు మననం చేసికొంటూ
ఆనందించే నరుడు ధన్యుడు
అతడు ఏటి యొడ్డున నాటగా
సకాలంలో పండ్లనిస్తూ
ఆకులు వాడకయుండు చెట్టవంటివాడు
అతడు తాను చేపట్టిన కార్యాలన్నింటిలోను
విజయాన్ని పొందుతాడు -1, 2-3