పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రభువు సొలోమోను విూద ఆగ్రహం చెంది అతని రాజ్యాన్ని రెండు ముక్కలు చేసి ఓ ముక్కను యరోబాముకి ఇచ్చివేయాలి అనుకొన్నాడు. ఈ యరోబాము సాలోమోనుకు వెట్టిచాకిరి చేసేవాళ్లకు నాయకుడు. ఓ మారు యరోబాము యెరూషలేము నుండి వస్తుండగా పొలంలో అహియా ప్రవక్త అతన్ని కలుసుకొన్నాడు. ఆ ప్రవక్త తాను ధరించిపన్న క్రొత్త బట్టలను విప్పి వాటిని పండ్రెండు ముక్కలుగా చించివేసాడు. యరోబాముతో "ప్రభువు వీటిల్లో నీకు పదిముక్కలిస్తున్నాడు తీసికో" అన్నాడు. అనగా సొలోమోను రాజ్యంలో పది వంతులు చీలిపోతుందనీ దానికి యరోబాము రాబౌతాడనీ భావం, సాలోమోను గతించి అతని కుమారుడు రెహబాము రాజు కాగానే పై ప్రవచనం నెరవేరింది - 1రాజు 11,29-31.

హోషేయ తన కుమార్తెకు "లో రూహామా" అని పేరు పెట్టాడు. ప్రభువు యిస్రాయేలు ప్రజల విూద జాలిచూపడని ఈ పేరుకి అర్థం. అలాగే అతడు కుమారునికి *లో అమ్మి" అని పేరు పెట్టాడు. అనగా ప్రభువు యిస్రాయేలును తన ప్రజలుగా అంగీకరింపబడని భావం - హోషే 1,6.9. ఈలా పేర్లు పెట్టడం కూడ ప్రవచనాన్ని నటించి చూపడం క్రిందికే వస్తుంది. యెషయా కూడా ఈలాగే తన కుమారునికి ప్రవచనపూర్వకమైన పేరు పెట్టాడు - యెష 8, 1-4,

నూతవేదంలో క్రీస్తు ఈ ప్రక్రియననుసరించాడు. అతడు అంజారాన్ని శపించాడు-మత్త21,18–20, ఓ చిన్నబిడ్డను శిష్యుల మధ్యలో నిల్పి వాళ్ళ ఆ బిడ్డలా కావాలన్నాడు - 18,1-4 ఇక్కడ ప్రభువు ప్రవక్తల్లాగే నటన చేసి చూపించాడు. అగబు ప్రవక్త పౌలు నడికట్టతో నటన చేసి చూపించాడని ముందే చెప్పాం - అచ 21,10–11.

ఈ యధ్యాయంలో ప్రవచన రూపాలను ఏడింటిని పేర్కొన్నాం. ఇంకా వేరే రూపాలు కూడ వున్నాయి. ప్రవక్త ఒక్క మాటలతోనే గాదు ఇతర ప్రక్రియద్వారా గూడ దైవసందేశాన్ని విన్పిస్తాడు అనడానికి ఈ ప్రక్రియలన్నీ సాక్ష్యం.

4. కపట ప్రవక్తలూ, నిజ ప్రవక్తలూ

యిస్రాయేలీయుల్లో ఎప్పడూ ప్రవక్తలు చాలామంది వుండేవాళ్ళు వాళ్లల్లో నిజమైన ప్రవక్త యెవడో, స్వార్ధలాభం కోసం అబద్దాలు చెప్పే ప్రవక్త యెవడో నిర్ణయించడం కష్టంగా వుండేది. రాజుల గ్రంథం నుండి ఓ వదంతం పరిశీలిద్దాం. అహాబు అనే రాజు రామోతు గిలాదును ముట్టడింప గోరాడు. తాను పోషించే ప్రవక్తల సమాజాన్ని పిల్పించి యుద్ధంలో తనకు విజయం కలుగుతుందో లేదో చెప్పమన్నాడు. ఆ సమాజంలో నాల్లువందల మంది ప్రవక్తలున్నారు. వాళ్ల నాయకుడు సిదియా. అతడూ ఆ ప్రవక్తలూ అంతా ఏకగ్రీవంగా "నీవు యుద్దానికివెళ్ల ప్రభువు నీకు విజయం దయచేస్తాడు" అని