పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/218

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నీ సన్నిధినుండి నన్ను గెంటివేయకు
నీ పరిశుద్ధాత్మను నా యొద్దనుండి తీసివేయకు -51, 10-11
10 ప్రభువు పశ్చాత్తాపపడేవాళ్ళకు సమీపంలోనే వుంటాడు
సంతాప పడేవాళ్ళను రక్షిస్తుంటాడు - 35,19
11 దేవా! నే నర్పించే బలి పశ్చాత్తాప పూరితమైన హృదయమ
పశ్చాత్తాప పూరితమూ వినయాన్వితమూ ఐన హృదయాన్ని
నీ వనాదరం చేయవు = 51, 17
12 మహోన్నతుడు శాశ్వతుడు పవిత్రుడునైన
ప్రభువు ఈలా నుడువుతున్నాడు
నేను ఉన్నతమైన పవిత్రస్థలంలో వసించేవాణ్ణి
ఐనా వినయాత్మలు పశ్చాత్తాపమనస్కులు
ఐనవారితోను వసిస్తాను
వారికి నూత్న బలాన్ని దయచేస్తాను - యెష 57,15
13 ప్రభువు ఈలా అంటున్నాడు
ఆకాశం నాకు సింహాసనం
భూమి నాకు పాదపీఠం
మీరు నా కెట్టి మందిరాన్ని కడతారు?
ఎలాంటి విశ్రమస్థానాన్ని నిర్మిస్తారు?
భూమ్యాకాశాలను నేనే చేసాను
ఇవియెల్ల నావే - ఇవి ప్రభువు పల్కులు
వినయాన్వితుడు పశ్చాత్తాప మనస్కుడు ఐ
నా వాక్కులకు భయపడే నరుణ్ణి
నేను ప్రీతితో జూస్తాను - యెష 66, 1-2
14 ప్రభో! నా నోటికి తాళం వేయించు
నా పెదవులకు గడియ వేయించు
నా మనస్సును దుష్కార్యాలమీదికి పోనీయకు
దుషుల దుష్టకార్యాల్లో నన్ను పాల్గొననీయకు - 141, 3-4
15 నీవు నా ముఖం చూడలేవు. ఏ నరుడూ నన్ను జూచి బ్రతకలేడు - నిర్గ 33, 20
16 సైన్యములకు అధిపతియైన ప్రభువుని పరిశుద్దునిగా గణించండి. అతన్ని చూచి భయపడండి.- యెష 8, 13