పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/217

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నరుడు పాపం వలన అశుద్దుడౌతాడు. ఓ కుష్టరోగిలా తయారౌతాడు. ప్రభువే అతన్ని శుద్ధిచేస్తాడు. కరుణతో కడుగుతాడు. అప్పడు నరుడు మంచులా తెల్లనౌతాడు. ప్రభువు తన్ను గెంటివేయకుండా వుండాలనీ, తన హృదయంలోని పరిశుద్దాత్మను తొలగించకుండా వుండాలనీ పాపి ప్రార్థన. దేవుడు నరుల పాపాలను లెక్కెడితే ఎవరూ ఆ పవిత్రమూర్తి ముందు నిలువలేరు. కాని ప్రభువు నరులను శిక్షించడానికంటె క్షమించడానికే సిద్ధంగా వుంటాడు.

నరుడు సమర్పించుకొనే ఉత్తమ బలి పశ్చాత్తాప హృదయమే, సంతప్త మానసమే. అతడు తన ప్రధాన బలహీనతలను తలంచుకొని గూడ ప్రభుని సహాయం అడుగుకొంటాడు. తాను దుర్భాషలాడకుండా వుండేలాగ తన నోటికి తాళం వేయించవలసిందిగా మనవి చేసికొంటాడు. ఆ మనవిని ప్రభువు ఆలిస్తాడు.

1. ప్రభో నీకే, నీకే ద్రోహంగా నేను పాపం చేసాను
నీ యెదుట నేను దుష్కార్యాలు చేసాను - కీర్త51,4

2. నేను పట్టినప్పటినుండీ పాపాత్ముడనే
మా యమ్మ కడుపున పడినప్పటి నుండీ దుర్మార్గుడనే - 51,5

3. నా పాపాలనే వెల్లువలో నేను మునిగిపోయాను
అవి మోయలేని భారంలాగ నా తలమీద నిల్చాయి - 38, 4

4. నా తప్పిదాలను నేను ఒప్పకొంటున్నాను
నా పాపాలను తలంచుకొని పశ్చాత్తాప పడుతున్నాను - 38, 15

5. నా తప్పిదాలను కప్పిపెట్టుకోలేదు
నా దోషాలను నీ యెదుట ఒప్పకొన్నాను
నా పాపాలను దేవుని యెదుట ఒప్పకొంటాను అనుకొన్నాను
నీవు నా యపరాధాలను క్షమించావు - 32, 5

6. ప్రభూ! నా యావనకాలపు పాపాలను జ్ఞప్తికి దెచ్చుకోకు - 25,7

7. ప్రభో! నీవు మా దోషాలను లెక్కపెడితే మేమిక నిలువగలమా!
కాని నీవు మా తప్పిదాలను క్షమిస్తుంటావు కనుక
మేము నీ పట్ల భయభక్తులు చూపుతుంటాం - 130, 3

8. నీవు నన్ను నిర్మలుణ్ణి చేస్తే నేను పవిత్రుణితాను
నీవు నన్ను కడిగితే నేను మంచుకంటె తెల్లనౌతాను -51,7

9. దేవా! నాలో నిర్మల హాృదయాన్ని సృజించు
ఓ క్రొత్త అంతఃకరణాన్ని నాలో నెలకొల్పు