పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 277 P.pdf/216

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

21.దప్పిక కలిగినవాడు నావద్దకు వచ్చి దప్పిక తీర్చుకోవచ్చు. నన్ను విశ్వసించేవాని అంతరంగంలోనుండి జీవజల ప్రవాహాలు పొంగి పారతాయి - యోహా 7, 37-39

22.నేను దాహం గొన్నవాడ్డి జీవజలప చెలమునుండి స్వేచ్చగా నీళ్ళ త్రాగనిస్తాను - దర్శ 21,6

23.ప్రభువు ఆకలిగొన్నవాళ్ళను సంతృప్తి పరచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేసాడు - లూకా 1,58

24.నీవు దేవుని వరాన్ని గుర్తించినట్లయితే, నిన్ను నీళ్ళీయమని అడుగుతూంది ఎవరో నీవు తెలిసికొని వున్నట్లయితే, నీవే అతన్ని నీళ్ళు అడిగేదానివి. అప్పడతడు నీకు జీవజలం యిచ్చి వుండేవాడు - యోహా 4,10.

25.నన్నుపంపిన తండ్రి ఆకర్షిస్తేనే తప్ప ఎవడూ నా వద్దకు రాలేడు - యోహా 6,44

26.పరలోకంలోని మీ తండ్రి తన్నడిగిన వాళ్ళకు ఆత్మను సమృద్ధిగా దయచేస్తాడు - లూకా 11, 13

27.ఎవడూ యిద్దరు యజమానులను సేవింపలేడు - మత్త 6, 24

28.ప్రభో! మా హృదయాన్ని నీ కొరకే సృజించావు. నీ యందు విశ్రమించిందాకా దానికి విశ్రాంతి లేదు - అగస్టీను భక్తుడు

బాలస్తావత్ క్రీడాసక్తః
తరుణస్తావత్ తరుణీసక్తః
వృద్ధస్తావత్ చింతాసక్తః
పరమే బ్రహ్మణి కోపి నసక్తః - శంకరాచార్యులు

2. పాపమూ, పశ్చాత్తాపమూ

బైబులు భగవంతుడు పరమ పవిత్రుడు, అతడు పాపంవల్ల కోపం చెందుతాడు. పశ్చాత్తాపంవల్ల శాంతిని పొందుతాడు. పాపం నేరుగా భగవంతుణ్ణి ఎదిరిస్తుంది. అతన్నే వ్యతిరేకిస్తుంది. మనం అతనికి ద్రోహంగానే పాపం చేస్తుంటాం. పాపం ఎంత ఫరోరమైందో భక్తనికి తెలుసు. కనుకనే అతడు నేడు పాపపు వెల్లవలో మునిగిపోయానని బాధపడతాడు. ఐనా అతడు చిత్తశుద్ధి కలవాడు. కనుక ప్రభువు నెదుట తన పాపాలను ఒప్పకొంటాడు. ఆ పాపాలను కప్పిపెట్టుకోడు గదా, వాటికోసం పశ్చాత్తాప పడతాడు. ప్రభువుకూడ నెనరుతో అతని తప్పిదాలను క్షమిస్తాడు.